ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> This Week Latest Theatrical And OTT Releases

ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు

This Week Latest Theatrical And OTT ReleasesThis Week Latest Theatrical And OTT Releases

ప్రస్తుతం బాక్సాఫీసు చూస్తే నిస్సారంగా కనిపిస్తుంది. గత రెండు మూడు వారాలుగా ఇంట్రెస్టింగ్ సినిమా ఒక్కటీ కనిపించడం లేదు. వారం వారం చిన్న చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఏ ఒక్కటి ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. టిల్లు స్క్వేర్ తర్వాత ఇప్పటివరకు ప్రేక్షకులు మెచ్చే సినిమా ఏది విడుదల కాలేదు. ఆ లెక్కలోనే ఏప్రిల్ నాలుగో వారంలోను చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో విశాల్ రత్నం, నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. 

అయితే ఈ వారం ఓటీటీలలో కాస్త ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటితో పాటుగా యధావిధిగా కొత్త కొత్త వెబ్ సీరీస్ లు విడుదలవుతున్నాయి. 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ ఫ్లిక్స్‌ :

డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 25 

టిల్లు స్క్వేర్‌ (తెలుగు) – ఏప్రిల్‌ 26 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)- ఏప్రిల్‌ 25 

బుక్‌ మై షో :

కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్‌) – ఏప్రిల్ 26 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

భీమా (తెలుగు) – ఏప్రిల్‌ 25 

క్రాక్‌ (హిందీ)- ఏప్రిల్‌ 26 

This week theater-OTT films

movies