Advertisementt

అరె ఏంట్రా ఇది.. ఇంత అడ్డంగా దొరికేసావ్

Thu 22nd Feb 2024 09:02 PM
shanmukh jaswanth  అరె ఏంట్రా ఇది.. ఇంత అడ్డంగా దొరికేసావ్
Shanmukh Jaswanth arrested for alleged possession of drugs అరె ఏంట్రా ఇది.. ఇంత అడ్డంగా దొరికేసావ్
Advertisement
Ads by CJ

ఎంతో యాటిట్యూడ్ చూపించే షణ్ముఖ్ జస్వంత్ ఎపుడూ ఏదో ఒక వివాదంలో మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటాడు. ఒకసారి కారు యాక్సిడెంట్ చేసి.. పోలీసులతో గొడవ, ఎవ్వరూ చనిపోలేదు కదా అని మాట్లాడి యాటిట్యూడ్ చూపించడం, బిగ్ బాస్ హౌస్లో సిరితో అతిగా స్నేహం, ఆ తర్వాత లవ్ లో బ్రేకప్, ఇప్పుడు గంజాయి కేసులో షణ్ముఖ్ పేరు గట్టిగా మీడియాలో వినిపించడం. సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో అనుకోకుండా షణ్ముఖ్ ఇరుక్కుని గంజాయి కేసులో అరెస్ట్ అవడం చర్చనీయాంశం అయ్యింది.

సోదరుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకి గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ అడ్డంగా దొరికిపోవడమే కాదు.. ఇంట్లో గంజాయి దొరకడం విస్మయానికి గురి చేసింది. షణ్ముఖ్, అతని సోదరుడు వినయ్ కలిసే గంజాయి సేవించేవారని, వీరిని వైద్య పరిక్షల నిమిత్తం పంపగా.. షణ్ముఖ్, అతని సోదరుడు ఇద్దరూ గంజాయి సేవించినట్లుగా వైద్య పరీక్షల్లో నిర్ధారణ అవడంతో వీరిని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణలో ఉన్న షణ్ముఖ్ అతని సోదరుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

అది చూసిన నెటిజెన్స్ షణ్ముఖ్ చెప్పిన పాపులర్ డైలాగ్ అరె ఏంట్రా ఇది అంత అడ్డంగా దొరికిపోయావ్ అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.

Shanmukh Jaswanth arrested for alleged possession of drugs:

Bigg Boss fame Shanmukh Jaswanth arrested for alleged possession of ganja

Tags:   SHANMUKH JASWANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ