Advertisement

ఈసారి కూడా జగనేనట..

Fri 02nd Feb 2024 08:13 AM
jagan  ఈసారి కూడా జగనేనట..
Jagan ఈసారి కూడా జగనేనట..
Advertisement

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డేనని.. వైసీపీ ప్రభంజనం ఖాయమని న్యూస్ ఎరీనా అనే సంస్థ తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తున్నట్టు ఈ సంస్థ తేల్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రిపోల్ సర్వే అధికార పార్టీలో మాత్రం జోష్ నింపుతోంది. ఈ సర్వే ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వై నాట్ 175 అంటూ ఉవ్విళ్లూరుతున్న వైసీపీకి ఇది చాలా బూస్ట్ ఇచ్చింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. 

టీడీపీ-జనసేన కూటమికి 53 స్థానాల్లో విజయం..

న్యూస్ ఎరీనా సంస్థ డిసెంబర్ 1, 2023 నుంచి జనవరి 12, 2024 తేదీ వరకూ సర్వే నిర్వహించింది. 175 స్థానాలకు గానూ.. వైసీపీ 122 స్థానాల్లో విజయం సాధిస్తుందట. ఇక టీడీపీ-జనసేన కూటమి 53 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక ఓటు శాతం విషయానికి వస్తే వైసీపీ 49.14 శాతం ఓటింగ్‌ను సాధించగా.. టీడీపీ – జనసేన 44.34 శాతం.. కాంగ్రెస్ 1.21 శాతం, బీజేపీ 0.56 శాతం ఓట్లను సాధిస్తుందని న్యూస్ ఎరీనా సర్వే వెల్లడించింది. ఈ సర్వే లెక్క ప్రకారం జగన్ రెండోసారి అధికారం చేపట్టడం ఖాయంగానే కనబడుతుంది. 

ఇక ఈ సర్వే రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రభుత్వం అందించిన సేవలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఎమ్మెల్యేల పనితీరు, మూడు రాజధానులు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, టీడీపీ-జనసేన పొత్తు వంటి అంశాలను ఎజెండాగా తీసుకుని నిర్వహించినట్టు న్యూస్ ఎరీనా తెలిపింది. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి మైలేజ్ తెచ్చిందా? టీడీపీ-జనసేన పొత్తు జనాలకు నచ్చలేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

 

Jagan:

AP

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement