మళ్ళీ పెళ్లి అంటూ షాకిచ్చిన అమల పాల్

కోలీవుడ్ నటి అమలాపాల్ రెండో పెళ్ళికి సిద్ధమైంది. కొద్దిరోజులుగా సినిమాల విషయంలో సైలెంట్ గా ఉంటున్న అమలా పాల్ డిజిటల్ ఎంట్రీ కూడా అంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న అమలా పాల్ ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి రెడీ అయింది. గతంలో డైరెక్టర్ విజయ్ తో ప్రేమ లో పడి పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కుటుంభ విభేదాలతో విజయ్ తో విడిపోయి విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత అమలాపాల్ కెరీర్ బాగా డల్ అయ్యింది. 

అయినా సోషల్ మీడియాలో బాగా బిజీగా వుండే అమలాపాల్.. గ్లామర్ ఫొటోస్ తో నిత్యం హడావిడి చేస్తుంది. తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఇన్ ఫామ్ చేసింది. గోవా వేదికగా అమలాపాల్ కి జగత్ దేశాయ్ అనే తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అక్కడే గోవాలో జగత్ దేశాయ్ డాన్స్ చేస్తూ అమలా పాల్ కి స్వీ గా క్యూట్ గా ప్రపోజ్ చేశాడు. అతనికి ముద్దు పెడుతూ అమలా పాల్ కూడా లవ్ యాక్సప్ట్ చేసింది. దీనికి సంబందించిన వీడియోని జగత్ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చెయ్యడంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

మొదటి భర్త విజయ్ కి విడాకులిచ్చి ఇన్నేళ్ళుగా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న అమలా పాల్ ఇలా సడన్ గా రెండో పెళ్లి విషయాన్ని పబ్లిక్ గా చెప్పి అందరికి షాకిచ్చింది. ప్రేమ విషయాన్ని చెప్పిన అమలా పాల్ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. ప్రస్తుతం అమలాపాల్ ద్విజ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 

Amala Paul readies for second marriage

Amala Paul announces second marriage
amala paul