ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ డైలాగ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా టైటిల్, గ్లింప్స్ రిలీజ్  చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని సినిమా సక్సెస్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించింది. అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమెంట్స్, యాక్షన్, హీరోయిజం అన్నీ సినిమాలో ప్యాకేజ్ గా ఉన్నట్లు ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ తో తెలిసింది. ఇక ఈ గ్లింప్స్ లోని ఐరెనే వంచాలా ఏంటి..? డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో ఈ డైలాగ్ వైరల్ అవుతోంది.

ఈ ట్రెండింగ్ చూసి అసలు ఇంటర్నెట్ లో ఏం నడుస్తుంది...? అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు విజయ్. ఐరెనే వంచాలా ఏంటి...? డైలాగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విజయ్ దారినే నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ఫాలో అయ్యింది. మేము కూడా ఈ మ్యాడ్ నెస్ లో భాగమవుతున్నాం. అంటూ ఐరెనే వంచాలా ఏంటి...? డైలాగ్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కొందరు నెగిటివ్ గా ట్రోల్స్ చేసినా దాన్ని కూడా విజయ్ దేవరకొండ పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ డైలాగ్ వైరల్ అవుతుండటంతో ఐరెనే వంచాలా ఏంటి...? అనే స్పెషల్ పోస్టర్ చేయించి రిలీజ్ చేశారు మేకర్స్.

Vijay Deverakonda encourages Family Star AIRANEVONCHALAENTI Trolls

Vijay Deverakonda encourages Trolls
vijay deverakonda