Advertisementt

టైగర్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

Sun 08th Oct 2023 11:52 AM
tiger 3  టైగర్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
The action of Tiger 3 had to be spectacular! : Salman Khan టైగర్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 ట్రైలర్ రాబోతోంది. టైగర్ 3 చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతోన్నారు. టైగర్ 3తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఈ మూవీ చాలా ప్రత్యేకం అని సల్మాన్ ఖాన్ తెలిపారు.

ఇది వరకు ఇండియన్ సినిమాలో చేయని, చూడని యాక్షన్ సీక్వెన్స్‌ను టైగర్‌ 3లో నాతో చేయించారు. ఇంత భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసే టైంలో సెట్స్‌లో నేను చిన్న పిల్లాడిని అయ్యాను.. ఎంతో ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాను. టైగర్ 3 ట్రైలర్ వచ్చినప్పుడు ఆ విషయం మీకు కూడా అర్థం అవుతోంది. అద్భుతమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి అని సల్మాన్ ఖాన్ అన్నారు.

టైగర్ 3 కథ ఎలా ఉండబోతోంది.. ఎలాంటి ట్విస్టులు ఉండబోతోన్నాయి.. ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందన్న విషయాలు ప్రేక్షకుల ఊహకు అందవు. గ్రిప్పింగ్‌గా కథ, కథనాలుంటాయి. టైగర్ 3 కథ విన్న వెంటనే నాకు నచ్చింది. ఇదే టైగర్ చేసే అత్యంత ప్రమాదకరమైన మిషన్ కానుంది అని సల్మాన్ ఖాన్ తెలిపారు.

The action of Tiger 3 had to be spectacular! : Salman Khan:

Tiger 3 trailer update 

Tags:   TIGER 3
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ