Advertisementt

బాలీవుడ్ లో ఉత్తములు వీళ్ళే!

Sun 28th May 2023 10:48 AM
iifa awards 2023  బాలీవుడ్ లో ఉత్తములు వీళ్ళే!
IIFA 2023 : Hrithik Roshan, Alia Bhatt win best actors బాలీవుడ్ లో ఉత్తములు వీళ్ళే!
Advertisement

దుబాయ్ వేదికగా కలర్ ఫుల్ గా ఐఫా 2023 అవార్డుల వేడుకలు అంగరంగ వైభవంగా శనివారం సాయంత్రం జరిగాయి. బాలీవుడ్ తారల తళుకుల మధ్య అదిరిపోయే డాన్స్ పెరఫార్మెన్స్ లతో గ్రాండ్ గా జరిగిన వేడుకలో బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్-అమితాబచ్చన్ లు హోస్ట్ లుగా అలరించారు. రకుల్, కృతి సనన్, జాక్వలిన్ లు తమ డాన్స్ పెరఫార్మెన్సెస్ తో అదరగొట్టేసారు. బాలీవుడ్ లో ఉత్తమనటనకు గాను హీరో హృతిక్ రోషన్ అవార్డు అందుకున్నారు. విక్రమ్ వేదాలో హృతిక్ నటనకు ఈ అవార్డు వరించింది.

గంగూభాయ్ కతియావాడి చిత్రంలో గంగూభాయ్ పాత్రకు అలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు కొల్లగొట్టింది. అయితే అలియా భట్ ఈ అవార్డు వేడుకకి హాజరు కాకపోవడంతో ఆమె తరపున గంగూభాయ్ నిర్మాత అవార్డు అందుకున్నారు. ఈ ఐఫా వేడుకలో బ్రహ్మాస్త్ర పార్ట్ 1, అలియా భట్ గంగూభాయ్ కతియావాడి చిత్రాలు అత్యధిక అవార్డుని కొల్లగొట్టిన చిత్రాలుగా నిలిచాయి. ఇక మిస్టరీ థ్రిల్లర్ గా హిందీ దృశ్యం2 నిలిచింది. 

నటుడు కమల్ హాసన్ అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ రీజనల్ సినిమా ఇండియన్ పురస్కారాన్ని.. భారతీయ సినిమాకి విశిష్ట సేవలందించినందుకు గాను అందుకున్నారు. అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ రీజనల్ సినిమా అవార్డుని రితేష్ దేశ్ ముఖ-జెనీలియా దంపతులు అందుకున్నారు. ఉత్తమ సపోర్టింగ్ కేటగిరిలో మౌని రాయ్ బ్రహ్మాస్త్ర 1 కి అవార్డు అందుకుంది.

IIFA 2023 : Hrithik Roshan, Alia Bhatt win best actors:

All the winners at IIFA Awards 2023 in Abu Dhabi

Tags:   IIFA AWARDS 2023
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement