Advertisement

బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందే

Tue 24th Jan 2023 06:21 PM
nandamuri balakrishna  బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందే
Balayya should apologize బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందే
Advertisement

బాలకృష్ణ వీరసింహారెడ్డి ఈవెంట్ లో అక్కినేనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనని చిక్కుల్లో పడేసింది. ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ అసందర్భంగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనని రోడ్డుకీడుస్తున్నాయి. ఇప్పటికే అక్కినేని అభిమానులు బాలయ్యపై ఆగ్రహంగా ఉండగా.. అక్కినేని యంగ్ హీరోలు నాగ చైతన్య, అఖిల్ లు మాత్రం బాలకృష్ణ పేరు ఎత్తకుండానే తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరా గారు, ఎస్ వి రంగారావు గారు కళామతల్లి ముద్దుబిడ్డలు.. వారిని అగౌరవపరుస్తూ మాట్లాడితే మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ సుతిమెత్తగా నోట్ వదిలారు.

అయితే అక్కినేని అభిమానులు మాత్రం బాలకృష్ణ అక్కినేనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మొన్నెప్పుడో తాను తెలియక మాట్లాడిన మాటలకే బాలకృష్ణ వారికి క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ వదిలారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ అక్కినేనిపై చేసిన వ్వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పేస్తే పోలా అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. మరి బాలకృష్ణ ఈ దుమారంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Balayya should apologize:

Nandamuri Balakrishna should apologize

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement