Advertisement

నయన్-విగ్నేష్ లకి బిగ్ రిలీఫ్

Wed 26th Oct 2022 06:04 PM
nayanthara,vignesh shivan,tn health ministry  నయన్-విగ్నేష్ లకి బిగ్ రిలీఫ్
Nayan, Vignesh Did Not Break Surrogacy Laws నయన్-విగ్నేష్ లకి బిగ్ రిలీఫ్
Advertisement

నయనతార-విగ్నేష్ శివన్ లు జూన్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని.. మూడు నెలలు తిరక్కుండానే కవల పిల్లలకి తల్లితండ్రులమయ్యామంటూ ప్రకటించడంతో అటు అభిమానులు, ఇటు తమిళనాడు ప్రభుత్వం ఉలిక్కిపడింది. నయనతార-విగ్నేష్ శివన్ లు సరోగసి విధానం ద్వారా పిల్లలకి తల్లితండ్రులయ్యారని తెలుసుకున్న ప్రభుత్వం ఇది చట్టబద్ధమా, లేదంటే నిబంధనలు అతిక్రమణా అనే విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన నెక్స్ట్ డే నే.. నయన్-విగ్నేష్ లు తమకి ఆరేళ్ళ క్రితమే వివాహమయినట్టుగా వివాహ ధ్రువ పత్రం సమర్పించడమే కాకుండా, గత ఏడాది డిసెంబర్ లో సరోగసి ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లుగా నివేదిక సమర్పించారు.

అయితే నయనతార సరోగసి విధానం ద్వారా ఏ ఆసుపత్రిలో పిల్లలకి తల్లయ్యింది అంటూ ప్రభుత్వం ఆ ఆసుపత్రి నుండి విచారణ మొదలు పెట్టింది. నిన్న మంగళవారం ఈ కమిటీ విచారణని పూర్తి చేసి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజెయ్యగా.. అందులో నయనతార - విగ్నేష్ లు నిబంధనలు తిక్రమించలేదని, వారికి 2016 మార్చ్ లో రిజిస్టర్ మ్యారేజ్ అయ్యింది అని, చెన్నైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో పూర్తి నిబందనలకు లోబడే కవలల పిల్లకి తలితండ్రులయ్యారని, వారు ఎలాంటి తప్పు చెయ్యలేదని ఆ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. దీనితో నయన్-విగ్నేష్ లు ఎలాంటి తప్పు చెయ్యలేదని, వారు నిబంధనల ప్రకారమే తల్లితండ్రి అయ్యారంటూ తమిళనాడు హెల్త్ మినిస్టర్ ప్రకటించారు.

Nayan, Vignesh Did Not Break Surrogacy Laws:

Nayanthara, Vignesh Shivan Did Not Break Surrogacy Laws: TN Health Ministry

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement