Loading...

మహేష్ న్యూ లుక్

Mahesh New Look

మహేష్ బాబు లుక్ విషయంలో ఆయన ఫాన్స్ పిచ్చ హ్యాపీ గా ఉంటారు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు అందం మరింతగా పెరిగిపోతుంది. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాటలో మహేష్ గురించి పొగిడినవారే కానీ, పొగడని వారు లేరు. మాములుగా అయితే హీరోయిన్ గ్లామర్ షో గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ మహేష్ అందం గురించే మాట్లాడుకున్నారు.. అంతలాంటి అందం మహేష్ సొంతం. ఈ అందాన్ని మెయింటింగ్ చెయ్యాలంటే దూలతీరిపోతుంది అని మహేష్ చెప్పిన డైలాగ్ కరెక్ట్. 

అంతలా జిమ్ చేసి, స్టైలిస్ట్ లని మెయింటింగ్ చెయ్యడం అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇక త్రివిక్రమ్ సినిమా SSMB28 లోను మహేష్ క్లాసీ లుక్ లోనే కనిపిస్తారని తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన హీరోలని స్టైలిష్ గానే చూపిస్తారు. కానీ ఈమధ్యన స్విస్ వెళ్ళిన మహేష్ తన లుక్ ని చేంజ్ చేసారు. కారణం ఆయన ఓ యాడ్ షూట్ కోసం ఆలా కొద్దిగా గెడ్డం పెంచారు. నిన్న శనివారం మహేష్ యాడ్ షూట్ పిక్ ని నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ రోజు మహేష్ తన స్టైలిష్ లుక్ ఒకటి వదిలారు. బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్న ఈ ఫొటోలో మహేష్ చిన్నపాటి గెడ్డం తో, స్టైలిష్ హెయిర్ స్టయిల్ తో కాస్త రఫ్ గానే కనిపిస్తున్నారు. మహేష్ న్యూ లుక్ చూసి ఎగ్జైట్ అవుతున్న ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Mahesh New Look goes viral

mahesh babu
mahesh new look
mahesh fans
ssmb28