Advertisementt

నాలాంటి వాడు రాజకీయాలకు పనికిరాడు

Sat 30th Jul 2022 07:28 PM
jagapathi babu,politics,villain,father  నాలాంటి వాడు రాజకీయాలకు పనికిరాడు
Jagapathi babu Gives Clarity Over Political Entry నాలాంటి వాడు రాజకీయాలకు పనికిరాడు
Advertisement
Ads by CJ

సినిమాల్లో నటించేవాళ్ళకి చాలామంది ఫైనల్ టార్గెట్ రాజకీయాలే. ఇప్పటికే సినిమాల్లో హీరోలుగా నటించిన వారు రాజకీయాల్లోనూ గెలిచి అక్కడ మంచి పొజిషన్ లో ఉన్నారు. కొంతమంది రాజకీయాల్లో నెగ్గలేక వెనక్కి వచ్చేసిన వారు ఉన్నారు. అందులో సీఎం గా చేసిన ఎన్టీఆర్ పాలిటిక్స్ లో సక్సెస్ అయితే.. చిరంజీవి పొలిటికల్ ఫెయిల్ అయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రాజకీయాలు, సినిమాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు. తాజాగా టాలీవుడ్ లో విలన్ కేరెక్టర్స్, అలాగే తండ్రి పాత్రల్లో అద్భుతంగా కెరీర్ ని మలచుకుంటున్న జగపతి బాబు ని రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందా? రాజకీయాల్లోకి వెళతారా? అని అడిగితే..

సినిమానే ఓ మాయ ప్రపంచం, పాలిటిక్స్ ఇంకా మాయలోకం. ఆ మాయాలోకాన్ని అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకు ఆలోచించేంత బుర్ర లేదు, ఓపిక అంతకన్నా లేదు. అందుకే రాజకీయాల గురించి నేను ఆలోచించడం లేదు. అందరితో కలుపుగోలు మాట్లాడే తెలివే లేదు. రాజకీయాల్లో జాయిన్‌ అయ్యాక వాళ్లతో ముందుకెళ్లడం కష్టం. అసలు నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల గురించి నాకున్న అవగాహన సున్నా. కాబట్టి పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం, నేను ఓ పార్టీ పెట్టడం అనేది ఎప్పటికి జరగని పని.. అంటూ పొలిటికల్ ఎంట్రీ పై జగపతిబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

 

Jagapathi babu Gives Clarity Over Political Entry:

Jagapathi Babu is definitely not aspiring to be a politician

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ