ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayanthara and Vignesh Shivan all set to get married

నయనతార వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చేసింది

Nayanthara and Vignesh Shivan all set to get marriedNayanthara and Vignesh Shivan all set to get married

నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి వార్తలతో సోషల్ మీడియా నిండిపోయింది. జూన్ 9 న నయనతార - విగ్నేష్ శివన్ లు తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే వేదిక ఖరారు చేసుకున్నారని, అలాగే కుల దేవత గుడిలో పొంగల్ పెట్టిన ఈ జంట పెళ్ళి పనుల్లో నిమగ్నమై ఉంది అంటూ ప్రచారం జరగడమే కానీ.. నయనతార నుండి కానీ, విగ్నేష్ శివన్ ఫ్యామిలీ నుండి కానీ ఈ పెళ్లి విషయమై క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ అవడమే కాదు.. ఆ డిజిటల్ ఇన్విటేషన్ సన్నిహితులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 

నయనతార - విగ్నేష్ శివన్ లు తమ పెళ్ళి అతికొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు, ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యనే చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కొద్దిమంది అతిథులకు డిజిటల్‌ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌ పంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డిజిటల్ ఇన్విటేషన్ ప్రకారం నయనతార - విగ్నేష్ ల పెళ్లి జూన్ 9 మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో జరగనున్నట్లుగా తెలుస్తుంది. మరి తిరుపతిలో నయన్ పెళ్లి కూతురు కాబోతుంది అన్నప్పటికీ.. బయటికి వచ్చిన ఇన్విటేషన్ ప్రకారం మహాబలిపురంలో నయన్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 

Nayanthara-Vignesh Shivan wedding invitation got leaked

nayanthara
vignesh shivan
nayanthara-vignesh shivan
nayanthara weds vignesh shivan