సర్కారు వారి పాట తగ్గేదే లే

Sarkaru Vaari Paata update

ఈమధ్యన సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.. సో మే 12 న మహేష్ రావడం కష్టం అంటూ ప్రచారం జరుగుతుంది. అలా ప్రచారం స్టార్ట్ అయ్యిందో లేదో.. ఇలా సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్.. జస్ట్ ఓ సాంగ్ బాలెన్స్ అంటూ టీం ప్రకటించింది. అయినా సర్కారు వారి పాట అనుకున్న తేదీ కి రిలీజ్ అవడం కష్టం పరశురామ్- మహేష్ స్లోగా ఉన్నారనే టాక్ నడుస్తుంది. కానీ రీసెంట్ గా మహేష్ ఆ సాంగ్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసెయ్యమని పరశురామ్ కి చెప్పారట.

అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేసిందట సర్కారు టీం. మహేష్ కూడా తన పాత్రకి తాలూకు డబ్బింగ్ మొదలు పెట్టారని ఎట్టి పరిస్థితుల్లోనూ మే 12 నుండి వెనక్కి తగ్గేదేలే అంటూ మహేష్ కూడా ఈ సినిమా పనులు త్వరగా కంప్లీట్ చేస్తున్నారట. ఈ నెల 25 కల్లా సర్కారు వారి పాట పోస్ట్ ప్రొడక్షన్, సాంగ్ షూట్ అన్ని పూర్తి అయ్యి ప్రమోషన్స్ కోసం టీం రంగంలోకి దిగిపోతుంది అంటున్నారు. మరి మహేష్ సర్కారు వారి పాటపై ట్రేడ్ లోనే కాదు ఫాన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. అందులో కళావతి సాంగ్ అద్భుతమైన హిట్ అవడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. 

Mahesh - parasuram Sarkaru Vaari Paata update

sarkaru vaari paata
mahesh babu
parasuram
keerty suresh
sarkaru vaari paata update