RC15 షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కడెక్కడంటే

RC15 update

రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సక్సెస్ మూడ్ లో ఉన్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత ఆచార్య డబ్బింగ్ పనులు కంప్లీట్ చేసిన ఆయన రీసెంట్ గానే ముంబై వెళ్లి వచ్చారు. తర్వాత దిల్ రాజు పార్టీలో భార్య సమేతంగా పాల్గొన్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం RC 15 కోసం రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC 15 కొత్త షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కాబోతుంది. మొదటి షెడ్యూల్ మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో జరగగా, తదుపరి షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ముగించారు.

ఇక RC 15 కిసంబందించిన షూటింగ్ హైదరాబాద్, అలాగే రాజమండ్రి, దుబాయ్ లతో పాటుగా కీలకమైన కొన్ని సన్నివేశాలను పంజాబ్, అమృత్ సర్ ప్రాంతాలలో చిత్రీకరణ చేయనున్నారనేది తాజాగా తెలుస్తున్న సమాచారం. RC 15 తదుపరి షెడ్యూల్ పంజాలో మొదలు పెట్టబోతున్నారని.. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన నటులు పాల్గొంటారని తెలుస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఎస్ జె సూర్య విలన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి కూడా భాగం కాబోతున్నట్లుగా టాక్.

RC15 shooting update

rc15
rc15 shooting update
ram charan
shankar
anjali
kiara advani