RC 15 పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Interesting News on RC15

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో పాన్ ఇండియా లో మంచి బోణి కొట్టారు. పాన్ ఇండియా మార్కెట్ లో వాల్యూ పెంచుకున్న రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని కూడా ఆ లెవల్ మూవీ నే చేస్తున్నారు. టాప్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC15 అంటూ మూడు లాంగ్వేజెస్ లో సినిమాని మొదలు పెట్టారు. ఈ సినిమాలో చరణ్ కి జోడిగా మరోసారి కియారా అద్వానీ నటిస్తుంది. గత నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో RC15 షూటింగ్ చేసిన శంకర్ అండ్ టీం ప్రస్తుతం చరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి దిల్ రాజు భారీ బడ్జెట్ పెడుతున్నారు. శంకర్ అంటేనే భారీతనం. మరి ఈ బడ్జెట్ విషయంలో RC15 పై బయటికొస్తున్న ప్రతి న్యూస్ సెన్సేషన్ అవుతుంది. అందులో ఓ సాంగ్ కోసం శంకర్ ఏకంగా 12 కోట్లు ఖర్చు చేయించారని అన్నారు. ఇప్పుడేమో ఓ ఫైట్ సీన్ కోసం 10 కోట్లు ఖర్చు చేయిస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ RC15 కి హైలెట్ గా నిలుస్తుంది అని.. అందుకే శంకర్ కాంప్రమైజ్ కాకుండా ఈ యాక్షన్ సీన్ ని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో చరణ్ కి విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తుండగా, మరో కీలక పొలిటికల్ కేరెక్టర్ లో అరవింద్ స్వామి నటిస్తారని తెలుస్తుంది. ఇంకా అంజలి, శ్రీకాంత్  లాంటి భారీ నటీనటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు.

Crazy update on RC15

ram charan
rc 15
director shankar
dil raju
kiara advani
anjali
sj surya
srikanth