Advertisementt

రజనీ, చిరు, నాగ్.. అందరికి తప్పని బాధ

Tue 18th Jan 2022 06:23 PM
rajanikanth,chiranjeevi,nagarjuna,sreeja,kalyan dev,aishwarya - dhanush,naga chaitanya - samantha  రజనీ, చిరు, నాగ్.. అందరికి తప్పని బాధ
Rajani, Chiru, Nag: Everyone Suffering రజనీ, చిరు, నాగ్.. అందరికి తప్పని బాధ
Advertisement

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య అల్లుడు ధనుష్ విడిపోతున్నాం అని సోషల్ మీడియా సాక్షిగా ప్రకటించేసారు. ఏంటో ఈమధ్య చాలా సెలబ్రిటీ జంటలు ఇలాగే విడిపోతున్నాయి. విడిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇది ఆ ఒక్క జంట కే కాదు, ఆ జంటల తల్లిదండ్రులకు కూడా ఎంతో బాధ కలిగించే విషయం. తల్లిదండ్రులు పోనీ మామూలు వాళ్ళ అంటే అదీ కాదు. పెద్ద స్టార్ డమ్ వున్నవాళ్లు, బాగా ధనవంతులు కూడాను. రజనీకాంత్ ఆరోగ్యం అప్పుడప్పుడు బాగా ఉండటం లేదు, అందులోకి తన కూతురు విడిపోతున్న విషయం ఇంకా బాధిస్తుంది. ఇది ఒక్క రజనీకాంత్ కే కాదండోయ్. 

మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా తప్పలేదు. తన చిన్న కూతురు శ్రీజ అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం. అటువంటి శ్రీజ.. మొదట్లో తల్లిదండ్రులని కాదని వివాహం చేసుకోంది. ఒక పాప పుట్టాక, వాళ్లిద్దరూ విడిపోయారు. తరువాత ఆమెకి మెగాస్టార్ చిరు మరొక వివాహం కూడా చేసారు, ఆనందం గా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వివాహం కూడా సరిగ్గా లేదు, విడిపోతున్నారు అన్న వార్త బాగా వినిపిస్తోంది. ఇది చిరంజీవి గారికి ఎంతో బాధాకరమయిన విషయం. 

అలాగే కొన్ని నెలల కిందట నాగార్జున కొడుకు నాగ చైతన్య, సమంత విడిపోతున్నాం అని సోషల్ మీడియా లో పెట్టారు. నాగార్జున కుటుంబంలో ఇది ఒక విచారకరమయిన సంఘటన. పెద్ద కొడుకుని పట్టుబట్టి మరీ నటుడిని చేసాడు నాగార్జున, అటువంటి చైతన్య వివాహం అలా అవటం వలన నాగార్జున ఎంత బాధ పడి వుంటారో చెప్పనవరసం లేదు. అప్పుడప్పుడు సామాన్య కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఇలా సెలబ్రిటీ ఇళ్లల్లో జరిగితే అది పెద్ద వార్త అవుతుంది, చర్చ నడుస్తుంది. ఏమైనా సెలబ్రిటీ వివాహాలు ఇలా విడిపోవటం బాధాకారమే.

Rajani, Chiru, Nag: Everyone Suffering :

Dhanush and Aishwarya Separated

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement