Advertisementt

జగన్ తో మీటింగ్: చిరు అడిగారు, నాకే కుదరలేదు

Thu 13th Jan 2022 02:00 PM
nagarjuna,bangarraju interview,chiranjeevi,ap cm,cm jagan,industry,nag,bangarraju interviews  జగన్ తో మీటింగ్: చిరు అడిగారు, నాకే కుదరలేదు
Nagarjuna on Chiranjeevi meet with CM Jagan జగన్ తో మీటింగ్: చిరు అడిగారు, నాకే కుదరలేదు
Advertisement

ఈరోజు గురువారం మెగాస్టార్ చిరు ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడమే కాదు.. ఆయనతో కలిసి లంచ్ కూడా చెయ్యబోతున్నారు. అయితే ఈ మీటింగ్ కి మెగాస్టార్ ఒక్కరే వెళుతున్నారా.. లేదంటే సినిమా పెద్దలు కూడానా అన్న అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. చిరంజీవి జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను చర్చిస్తారని తెలుస్తుంది. అయితే తాజాగా నాగార్జున బంగార్రాజు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. చిరంజీవి గారు జగన్ తో భేటీ కోసం వెళదామని తనకి చెప్పారని, అయితే తాను బంగార్రాజు ప్రమోషన్స్ లో బిజీగా వున్నాను.. మీరు వెళ్ళిరండి అని చెప్పినట్లుగా నాగార్జున చెప్పారు.

అంటే మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు జగన్ తో మీటింగ్ కోసం ఇన్వైట్ చేసినట్లుగా నాగార్జున రివీల్ చేసారు. అది ఎవరెవరు అనేది క్లారిటీ లేదు కానీ.. మెగాస్టార్ చిరు, జగన్ ని కలవబోతున్నారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. చిరు - జగన్ భేటీ వివరాలు మెగాస్టార్ మీడియాకి తెలియజేస్తారని అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. 

Nagarjuna on Chiranjeevi meet with CM Jagan:

Nagarjuna Interview 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement