ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli forced to cancel RRR press meet

జక్కన్న సారి: ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ క్యాన్సిల్

ఈ రోజు గురువారం ఉదయం నుండి ఆర్.ఆర్.ఆర్ సందడి సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా విపరీతంగా ఉంది. కారణం రాజమౌళి, ఎన్టీఆర్, నిర్మాత ముంబై వెళ్లి అక్కడ అజయ్ దేవగన్, అలియా భట్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇక అదే రోజు డిసెంబర్ 9 న హైదరాబాద్ లోనూ సాయంత్రం పివిఆర్ సినీమాక్స్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ అంటూ అనౌన్స్ చేసారు. ఈ ప్రెస్ మీట్ కి ఆర్.ఆర్.ఆర్ హీరోలు, మరియు టీమ్ మొత్తం హాజరవుతుంది అని చెప్పాడు. కేవలం మీడియాని మాత్రమే ఆహ్వానిస్తే బావుండేది.. కానీ ఈవెంట్ నిర్వాహకులు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ కి కూడా ఈ ప్రెస్ మీట్ కి పాస్ లు ఇవ్వడంతో.. ప్రెస్ మీట్ జరిగే వేడుక దగ్గర రచ్చ జరిగింది. ఫాన్స్ లెక్కకు మించి హాజరై సినీమాక్స్ లోని వస్తువులని తొక్కేసి రచ్చ చేసారు.

దానితో సినీమాక్స్ దగ్గరకు భారీగా పోలీస్ లు చేరుకొని ఫాన్స్ ని అదుపుచేసి బందోబస్త్ ఏర్పాటు చేసారు. 

ఈహఠాత్పరిణామానికి షాకయిన రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ మాత్రమే ప్రదర్శించి మీడియా కి, ఫాన్స్ కి సారి చెప్పి.. ఈ ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్ టు డేస్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ప్రెస్ మీట్స్ ఉంటాయని, మిస్ కమ్యూనికేషన్ వలన ఇదంతా జరిగింది అంటూ రాజమౌళి సారి చెప్పి ప్రెస్ మీట్ నుండి వెళ్లిపోయారు. మరి ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ కోసం ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, ఇంకా టీం కూడా వేదిక దగ్గరికి వచ్చినా.. ఫాన్స్ గందరగోళం వలన స్టేజ్ పైకి రాలేకపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవడంతో అభిమానులు కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యారు.  

Fans tsunami: RRR press meet canceled

Rajamouli forced to cancel RRR press meet
rajamouli
rrr movie
rrr trailer
ram charan
ntr
rrr press meet canceled