RC15 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో రీసెంట్ గానే మొదలైన RC15 ఫస్ట్ షెడ్యూల్ పూణే లో జరిగింది. పూణే లో వేసిన ప్రత్యేక సెట్ లో రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ పై శంకర్ పై ఓ కాష్ట్లీ సాంగ్ ని తెరకెక్కించారు. ఈ సాంగ్ కోసం రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ లు 12 రోజుల పాటు శ్రమించారు. ఈ సాంగ్ ని అత్యంత భారీ తనంతో, విజువల్ వండర్ గా ప్రెజెంట్ చెయ్యబోతున్నారు. ఈ ఒక్క సాంగ్ కే బోలెడంత ఖర్చు కూడా అయినట్లుగా చెబుతున్నారు. ఇంకా ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా శంకర్ పూర్తి చేసేసారట. దానితో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ కూడా పూణే నుండి హైదరాబాద్ కి తిరిగివచ్చేసాడని.. ఈ సినిమాకి సంబందించిన రెండో షెడ్యూల్ దివాళీ తర్వాత మొదలు పెడతారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సురేష్ గోపి విలన్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్ గా విశ్వంభర అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. పొలిటికల్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రలలో కనిపించనున్నారు.

RC15 Pune schedule nearing completion

RC 15 Pune schedule to be wrapped
rc15
ram charan
shankar
rc15 pune schedule
kiara advani
ram charan - kiara advani combo
suresh gopi