సినిమా సూపర్.. అయినా ప్లాప్ అయ్యింది

సాయి ధరమ్ తేజ్ - దేవా కట్ట కాంబోలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 న రిలీజ్ అయ్యింది. సాయి తేజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉండగానే సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా మొదటి షో కె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా..పొలిటికల్ లీడర్స్, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా రిపబ్లిక్ సినిమా చాలా బావుంది అంటూ ప్రశంసించారు. కొంతమంది రాజకీయనాయకులైతే రిపబ్లిక్ స్పెషల్ షోస్ వేయించుకుని కూడా చూసారు. కానీ రిపబ్లిక్ మూవీ ఫైనల్ గా ప్లాప్ లిస్ట్ లో చేరింది. రిపబ్లిక్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. 13 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన రిపబ్లిక్ మూవీ కి సగానికి సగం కలెక్షన్స్ కూడా రాలేదు. దానితో మేకర్స్ కి రిపబ్లిక్ మూవీ భారీ నష్టాలని చూపించింది.

ఏరియా      క్లోజింగ్ కలెక్షన్స్

నైజాం           -   1.97  

సీడెడ్‌            -  1.16

ఉత్తరాంధ్రలో   -   0.79  

ఈస్ట్‌ గోదావరి    -   0.45  

వెస్ట్‌ గోదావరి     -   0. 43

గుంటూరు         -   0.47

కృష్ణా               -   0.46

నెల్లూరు            -   0.31

రెండు తెలుగు రాష్ట్రాలు - 6.04 కోట్లు

ఇతర ప్రాంతాలు          -   0.33

ఓవర్సీస్                       -   0.49  

వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ - 6.86 కోట్లు షేర్, -12.65 కోట్లు గ్రాస్‌

Sai Tej Republic closing collections

Republic closing collections
sai tej
sai dharam tej
republic movie
sai tej republic closing collections