ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Radhe Shyam release date remains unaffected, film to release on 14th January 2022

ప్రభాస్ మరోసారి కన్ ఫర్మ్ చేసాడు

ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ జులై 30 న విడుదల కావాల్సి ఉండగా.. సెకండ్ వేవ్ వలన షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో.. రాధేశ్యామ్ మేకర్స్ రాధేశ్యామ్ ని సేఫ్ సైడ్ గా వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి స్పెషల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. అయితే బాలీవుడ్ సినిమాలన్నీ వరసబెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటించడం, ఆర్.ఆర్.ఆర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12 న రిలీజ్ డేట్ ఇవ్వొచ్చనే అనుమానాలు ఉన్న టైం లో ప్రభాస్ రాధేశ్యామ్ డేట్ ని మరోసారి కన్ ఫర్మ్ చేసింది టీం.

ప్రభాస్ విక్రమాదిత్య పోస్టర్ తో పాటు.. రాధేశ్యామ్ మూవీ జనవరి 14 2022  లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. దానితో ఆర్.ఆర్.ఆర్ సంగతి ఏమిటి అంటూ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ మళ్ళీ తికమక అవుతున్నారు. ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి బరిలో ఉంటే.. రాధేశ్యామ్ ఉండకపోవచ్చని అనడంతో.. వెంటనే రాధేశ్యామ్ మేకర్స్ అలెర్ట్ అయ్యి.. మరోసారి రిలీజ్ డేట్ ని ప్రకటించేసారు.

Radhe Shyam release on 14th January 2022

Radhe Shyam release date remains unaffected, film to release on 14th January 2022
radhe shyam pan india film
prabhas radhe shyam
pooja hegde radhe shyam
radhakrishna radhe shyam movie
uv creations radhe shyam
radhe shyam movie
radhe shyam update