Advertisementt

మ‌హాస‌ముద్రంలోని చెప్ప‌కే చెప్ప‌కే.. సాంగ్‌..

Fri 03rd Sep 2021 04:53 PM
cheppake cheppake song,maha samudram movie,siddharth,aditi rao hydari,anu emmanuel  మ‌హాస‌ముద్రంలోని చెప్ప‌కే చెప్ప‌కే.. సాంగ్‌..
Cheppake Cheppake Song From Maha Samudram మ‌హాస‌ముద్రంలోని చెప్ప‌కే చెప్ప‌కే.. సాంగ్‌..
Advertisement
Ads by CJ

శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ క‌లిసి న‌టిస్తోన్న మ‌హా స‌ముద్రం సినిమాపై అంఛ‌నాలు ఆకాశాన్నంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ ఒక మెమ‌ర‌బుల్ మూవీగా నిలిచేలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ చెప్ప‌కే..చెప్ప‌కే పాట‌ను ఈ నెల 6న విడుద‌ల‌ చేయ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో హీరోయిన్ అదితిరావు హైద‌రి స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల ఈ చిత్రం నుండి విడుద‌లైన మాస్ సాంగ్ హే రంభ పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రెండవ పాట చెప్పకే ... చెప్పకే ... ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది..

ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Cheppake Cheppake Song From Maha Samudram :

Cheppake Cheppake Song From Maha Samudram Will Be Out On September 6

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ