Advertisement

వైష్ణవ్ - రకుల్ టైటిల్ అండ్ లుక్

Fri 20th Aug 2021 12:32 PM
vaishnav tej,krish,vaishnav tej second film,vaishnav tej - krish titled kondapolam  వైష్ణవ్ - రకుల్ టైటిల్ అండ్ లుక్
Vaishnav Tej character in Kondapolam revealed వైష్ణవ్ - రకుల్ టైటిల్ అండ్ లుక్
Advertisement

ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ - గ్లామర్ గర్ల్ రకుల్ ప్రీత్ కాంబోలో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన సినిమా లుక్ అండ్ టైటిల్ పై అందరిలో మంచి ఆసక్తి ఉంది. కొండపొలం నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించాడు. వైష్ణవ తేజ్ - రకుల్ ప్రీత్ డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమా గత ఏడాది ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ గ్రాఫిక్ వర్క్ వలన రిలీజ్ లేట్ అయ్యింది. ఇక ఈ రోజు వైష్ణవ తేజ్ సెకండ్ మూవీ లుక్ అండ్ టైటిల్ ని రివీల్ చేసింది టీం. 

కొండ‌పొలం నవల పేరునే ఈ సినిమా టైటిల్ గా పెట్టేసారు. కొండపొలం లో గోర్రెల మంద‌ని మేపుకుంటూ అడ‌వికెళ్లిన క‌థానాయ‌కుడికి ఎదురైన సమస్యలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా. రెండు నెలలో షూటింగ్ కంప్లీట్ చేసిన క్రిష్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి మాత్రం ఏడెనిమిది నెలల టీమ్ తీసుకున్నాడు. కారణం విజువల్ ఎఫెక్ట్స్ కోసం. ఈ సినిమాలో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించడంతో.. సినిమాని పూర్తి చెయ్యడానికి ఇంత టైం తీసుకున్నాడు క్రిష్. 

Vaishnav Tej character in Kondapolam revealed:

Vaishnav Tej-Krish film titled Kondapolam

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement