మ్యాస్ట్రో స్ట్రీమింగ్ డేట్

నిన్న లవ్ స్టోరీ మూవీ రిలీజ్ డేట్ రావడంతో థియేటర్స్ లవర్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయిన శ్రీ విష్ణు రాజా రాజా చోర మూవీ హిట్ అవడంతో.. మేకర్స్ లో కాస్త కదలిక వచ్చేలా కనిపిస్తుంది. అయితే నాని టక్ జగదీశ్ మోస్ట్లీ ఓటిటి రిలీజ్ కంఫర్మ్ అయినట్లే. అయితే నితిన్ - నభ నటేష్ కాంబోలో తెరకెక్కిన బాలీవుడ్ అంధధూన్ మ్యాస్ట్రో మూవీ షూటింగ్ పూర్తి కావడం ఓటిటి రిలీజ్ అంటూ ప్రచారం జరిగినా మేకర్స్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మ్యాస్ట్రో ఓటిటి రిలీజ్ అని అందరూ ఫిక్స్ ఆయ్యారు. ఇక మ్యాస్ట్రో ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈమధ్యనే మ్యాస్ట్రో సింగిల్స్ ని రిలీజ్ చేస్తున్నారు. 

అయితే మ్యాస్ట్రో ఓటిటి స్ట్రీమింగ్ ఆగష్టు 15 న ఉండబోతుంది అని అన్నా.. ప్రస్తుతం ఆ డేట్ మారిపోవడంతో.. ఇప్పుడు మ్యాస్ట్రో స్ట్రీమింగ్ డేట్ సెప్టెంబర్ 10 న ఉండబోతుంది అని, వినాయక చవితి స్పెషల్ గా నితిన్ మ్యాస్ట్రో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా టాక్. మేకర్స్ కూడా వినాయక చవితి స్పెషల్ గానే మ్యాస్ట్రో స్ట్రీమింగ్ చెయ్యాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మ్యాస్ట్రో హాట్ స్టార్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం. 

Nithin Maestro streaming date locked?

Maestro streaming date locked?
nithin
maestro movie
nithin maestro
nithin maestro streaming date
hot star