Advertisementt

ఎన్టీఆర్ షో డేట్ వచ్చేసింది

Sat 14th Aug 2021 06:23 PM
ntr emk,young tiger ntr,jr ntr,meelo evaru kotiswarulu,gemini channel  ఎన్టీఆర్ షో డేట్ వచ్చేసింది
NTR EMK to entertain from this date ఎన్టీఆర్ షో డేట్ వచ్చేసింది
Advertisement

ఎన్టీఆర్ బుల్లితెర మీద సందడి చేసే టైం దగ్గరపడింది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తో ఉక్రెయిన్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. జెమినీ ఛానల్ లో చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫిస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుంది అనేది ప్రకటించారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని బుల్లితెర మీద చూద్దామా అని ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఆగష్టు 22 నుండి ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో జెమినీ ఛానల్ లో ప్రసారం కాబోతుంది. రక్షా బంధన్ రోజున ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది.

23 వ తేదీ నుండి అసలు ఆట షురూ కానుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ 13 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఎప్పుడో బిగ్ బాస్ హోస్ట్ గా బుల్లితెర మీద అదరగొట్టేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు మరోసారి ఎవరు మీలో కోటీశ్వరులు షో కి వస్తున్నాడనగానే ఫాన్స్ లో ఆత్రుత.. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైపోయి ఆ షో మీద అంచనాలు పెరిగిపోయాయి. 

NTR EMK to entertain from this date:

Official update oN NTR EMK

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement