Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Suriya Jai Bhim for Direct OTT release

సూర్య జై భీం ఓటిటి రిలీజ్ కన్ ఫర్మ్

Suriya Jai Bhim for Direct OTT release

గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ లో కోలీవుడ్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అనగానే.. తమిళంలో థియేటర్స్ యాజమాన్యాలు సూర్య పై విరుచుకుపడ్డాయి. అయినప్పటికీ.. నిర్మాతగా తనకి లాస్ వస్తుంది అని సూర్య డేర్ చేసి ఆకాశం నీ హద్దురా మూవీ ని అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ చేసాడు. భార్య జ్యోతిక నటించిన సినిమాలను డైరెక్ట్ ఓటిటి కి ఇచ్చేసి అందరికి షాకిచ్చాడు. సూర్య సినిమాలను తమిళనాడు థియేటర్స్ లో రిలీజ్ కానివ్వమని థియేటర్స్ యాజమాన్యాలు నానా యాగీ చేసాయి. కానీ సూర్య మాత్రం తాను అనుకున్నదే చేసాడు. 

తాజాగా సూర్య నిర్మాణంలో ఆయన హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాని సూర్య ఓటిటికి అమ్మేశాడు. అది కూడా జై భీం అంటూ రీసెంట్ గానే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకున్న సినిమాని అమెజాన్ ప్రైమ్ నుండి నవంబర్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. అలాగే భార్య జ్యోతిక నటించిన చిత్రాన్ని కూడా అక్టోబర్ లోనే అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా సూర్య ప్రకటించాడు. సో సూర్య జై భీం నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రిలీజ్ కాబోతుంది. 

Suriya Jai Bhim for Direct OTT release via Amazon Prime

suriya
jai bhim movie
kollywood hero surya
jai bhim direct ott release
amazon prime