Loading...

ఆచార్య టైటిల్ కథపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Interesting News on Acharya Title

చిరు - రామ్ చరణ్ - కొరటాల కాంబోలో భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా చిరు - రామ్ చరణ్ నక్సలైట్ లుక్ తో అప్ డేట్ ఇచ్చింది టీం. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా చెప్పింది ఆచార్య టీం. అయితే ఈ సినిమా కి ఆచార్య టైటిల్ పెట్టినప్పుడు తన ఫ్యామిలీ అందరి దగ్గర టైటిల్ పై చిరు ఒపీనియన్ అడిగారట. మెగా ఫ్యామిలిలో ప్రతి ఒక్కరు ఆచార్య టైటిల్ ని ఓకె చేశారట. అంతేకాదు చిరు తల్లికి ఆచార్య టైటిల్ తెగ నచ్చేసిందట. చిరంజీవి ప్రతి ఒక్క సినిమా టైటిల్స్ విషయంలో ఫ్యామిలీ ఒపీనియన్ తీసుకుంటారట. 

గతంలో మెగాస్టార్ చిరు చేసిన రాక్షసుడు, కిరాత‌కుడు లాంటి టైటిల్స్ పెట్టినప్పుడు చిరు తల్లి కి ఆ టైటిల్ అస్సలు నచ్చలేదట. తన కొడుకు కి సాఫ్ట్ గా, స్టైలిష్ గా ఉండే టైటిల్స్ బావుంటాయని.. రాక్షసుడు, కిరాతకుడు అనే టైటిల్ భయంకరంగా ఉంటాయని, అలాంటి టైటిల్స్ చిరు కి సూటవ్వవు అని చిరు తల్లి భావించేవారట. కానీ కథ ప్రకారం ఆ సినిమాలకి అవే టైటిల్స్ పెట్టాల్సి వచ్చిందట. ఇక ఆచార్య టైటిల్ మాత్రం మెగా ఫ్యామిలీ తెగ నచ్చేసిందట. ఇలాంటి టైటిల్స్ అరుదుగా కుదురుతాయంటూ చిరు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. చిరు - రామ్ చరణ్, కాజల్ - పూజ హెగ్డే లు నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్.  

Acharya Title news

acharya movie
chiranjeevi acharya movie
ram charan acharya movie
ram charan - chiru combo
ram charan - pooja hegde combo
chiru - kajal combo
koratala siva acharya movie
sangeetha
kajal
pooja hegde
chiranjeevi
ram charan
acharya title news