ఫైనల్ టచ్ కోసం ఆర్.ఆర్.ఆర్ అక్కడికి

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవల్లో మొదలైపోయాయి. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో అలియా భట్ సీత గా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణని హైదరాబాద్ లో ఫినిష్ చేసుకుని.. ఇక ఫైనల్ టచ్ కోసం టీం మొత్తం నేడు ఉక్రెయిన్ కి ఎగిరిపోయింది. ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ కోసం ఆర్.ఆర్.ఆర్ టీం ఉక్రెయిన్ వెళుతున్నట్టుగా అధికారిక ప్రకటన ఇచ్చారు. 

ఈ ఫైనల్ షెడ్యూల్ ని త్వరగా పూర్తి చేసుకుని ఆర్.ఆర్.ఆర్ టీం రిలాక్స్ అవుతుంది.. కానీ రాజమౌళి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీ అవుతారు. అక్టోబర్ 13 న సినిమాని ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని రాజమౌళి కంకణం కట్టుకుని.. రాక్షసుడిలా ఆర్.ఆర్.ఆర్ పనులు కంప్లీట్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ టచ్ ఇవ్వడానికి ఉక్రెయిన్ బయలు దేరి వెళ్లారు. ఈ షెడ్యూల్ లోనే ఆర్.ఆర్.ఆర్ ప్యాచ్ వర్క్‌తో పాటు పాటల చిత్రీకరణ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. 

RRR movie update

NTR - Ram charan RRR special update
rrr pan india movie
ntr with ram charan
ram charan as alluri sita ramaraju
komaram bheem as ntr
rajamouli
jakkanna
ntr rrr movie
ram charan rrr movie
rajamouli rrr
d.v.v danayya
dvv entertainment
alia bhatt
ajay devagan