ఆచార్య హడావిడి ఏమిటో

చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ ఫైనల్ షెడ్యూల్ కోకాపేట టెంపుల్ సెట్ లో జరుగుతుంది. చిరు.. సినిమాలో ప్రధాన తారాగణం మొత్తం లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. అయితే ఆచార్య అప్ డేట్ కోసం మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మే లో విడుదల కావాల్సిన ఆచార్య ప్రస్తుతం వాయిదా పడింది. మళ్ళీ రిలీజ్ ఎప్పుడు డేట్ ఎప్పుడు ఇస్తారో అనే ఆతృతలో ఫాన్స్ ఉన్నారు. అయితే ఆచార్య ని దసరా బరి అంటున్నా రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ ఉంది ఆ టైం లో వద్దు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. 

అయితే తాజాగా ఆచార్య సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఆచార్య మూవీ డేట్, న్యూ పోస్టర్ వస్తుంది అంటూ మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ట్విట్టర్ లో ఆచార్య ని ట్రెండ్ చేస్తున్నారు. చిరు కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ తో దిగిపోతున్నాడంటూ, ఆచార్య అప్ డేట్ సూన్ అంటూ నానా హంగామా చేస్తున్నారు ఫాన్స్. అయితే చిరు ఆచార్య ని లాంగ్ వీకెండ్ చూసి రిలీజ్ చేసే యోచనలో టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Acharya hashtag on twitter

Acharya hashtag trends in twitter
acharya movie
chiranjeevi acharya movie
ram charan acharya movie
ram charan - chiru combo
ram charan - pooja hegde combo
chiru - kajal combo
koratala siva acharya movie
sangeetha
kajal
pooja hegde
chiranjeevi
ram charan
devi sri prasad
acharya