Advertisementt

రాజ్ కుంద్రా బిజినెస్ రోజుకి అంతొస్తుందా

Wed 21st Jul 2021 08:47 PM
raj kundra,shilpa shetty husband,shilpa shetty,raj kundra case,explosive bank details  రాజ్ కుంద్రా బిజినెస్ రోజుకి అంతొస్తుందా
Raj Kundra Earned Rs 6-10 Lakh Daily From Business రాజ్ కుంద్రా బిజినెస్ రోజుకి అంతొస్తుందా
Advertisement
Ads by CJ

రాజ్ కుంద్రా పేరు శిల్ప శెట్టి భర్త గానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. శిల్ప శెట్టి తన భర్త రాజ్ కుంద్రా తో కలిసి పలు బిజినెస్ చేసేవారు. తాజాగా రాజ్ కుంద్రా బ్లు ఫిలిమ్స్ సైడ్ బిజినెస్ తో ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. బాలీవుడ్ లో బడా వ్యాపారస్తుల ఫ్యామిలీగా క్రేజ్ ఉన్న రాజ్ కుంద్రా ఫ్యామిలీ ఇప్పుడు ఇలాంటి నీచమైన వ్యాపారంతో కోట్లు గడించాడు అనగానే రాజ్ కుంద్రాని అందరూ అస్యహించుకుంటున్నారు.  

ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా ప్రయత్నించినా.. అది రాలేదు. దానితో కష్టడీలోనే ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ ల ఇంటరాగేషన్ లు ఎలాంటి విషయాలు బయటపెడతాడో అనే క్యూరియాసిటీ వచ్చేస్తుంది జనాలకు. రాజ్ కుంద్రా అరెస్ట్ పై పలువురు నటీమణులు, మోడల్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నీలి చిత్రాల యాప్స్ ద్వారా రాజ్ కుంద్రా రోజువారీ సంపాదన వింటే షాకవ్వాల్సిందే. 

వెస్ట్ ముంబయిలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి పోలీసులు అరెస్టు చేయగా.. ఆ కంపెనీ రాజ్ కుంద్రా బినామీ పేరు మీద ఉంది అని, ఇక రాజ్ కుంద్రా బ్యాంకు డిటైల్స్ సంపాదించిన పోలీస్ లు షాకవుతున్నారట. రాజ్ కుంద్రా రోజువారీ సంపాదన అది కూడా కేవలం ఈ బ్లు ఫిలిమ్స్ తో ఎంత సంపాదిస్తున్నాడో చూసి షాకయ్యారట. హాట్ హిట్ మూవీస్ సంస్థ నుంచి అతడి అకౌంట్లోకి ప్రతి రోజు లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే నీలి చిత్రాలు యాప్స్ ద్వారా రాజ్ కుంద్రా రోజుకి ఆరు నుండి పది లక్షలు సంపాదిస్తున్నాడట. ఇది చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు సైతం నోరెళ్లబెడుతున్నారట. 

Raj Kundra Earned Rs 6-10 Lakh Daily From Business:

Raj Kundra case: Explosive bank details revealed

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ