Advertisement

దీపికా ఫ్యామిలీ మొత్తానికి కరోనా

Tue 04th May 2021 07:31 PM
deepika padukone,tests positive,covid-19,deepika father prakash padukone,deepika mother ujjala,deepikasister anisha,contracted the virus  దీపికా ఫ్యామిలీ మొత్తానికి కరోనా
Deepika Padukone tested positive for Covid 19 దీపికా ఫ్యామిలీ మొత్తానికి కరోనా
Advertisement

కరోనాకు కాదు ఎవ్వరూ అతీతులకు అన్నట్టుగా కరోనా వైరస్ న బారిన పడని మనిషి ఉండరేమో అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం.టాప్ సెలబ్రిటీస్ దగ్గరనుండి.. పొలిటికల్ లీడర్స్, సామాన్య ప్రజలు కరోనా సెకండ్ వేవ్ కల్లోలానికి విలవిల్లాడుతున్నారు. బాలీవుడ్ లో కరోనా బారిన పడని సెలెబ్రిటీ లేరంటే నమ్మలేమో. అలియా భట్, రణబీర్ కపూర్, అమితాబ్, అమీరా ఖాన్, అక్షయ్ కుమార్ ఇలా ఎవ్వరిని వదల్లేదు. టాలీవుడ్ లో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ రీసెంట్ గా అల్లు అర్జు, పూజ హెగ్డే అమ్మో లిస్ట్ చెప్పాలన్నా కష్టమే. తాజాగా కరోనా బారిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా పడింది అనే న్యూస్ అభిమానులని కలవరపెడుతుంది.

దీపికా కి కరోనా పాజిటివ్ రాగా.. ఆమె హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీపికా మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. పది రోజులుగా కరోనా లక్షణాలతో ఉన్న దీపికా తండ్రి ప్రకాశ్‌ పడుకోనే, తల్లి ఉజ్జల, సోదరి అనీషాలకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా దీపికా కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్లుగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం దీపికా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. ఆమె డాక్టస్ సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీపికా పదుకొనే ఆమె ఫామిలీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. #GetwellSoon Deepika  అంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

Deepika Padukone tested positive for Covid 19:

Deepika Padukone tests positive for Covid-19; father Prakash Padukone, mother Ujjala, and sister Anisha have also contracted the virus

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement