తారక్ కి హ్యాండ్ - చరణ్ కి డేట్స్

తెలుగులో స్టార్ హీరోల సినిమాలు చేసింది. కానీ అమ్మడుకి హిట్ దక్కలేదు. అయినా పాపకి ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. అప్పుడో ఇప్పుడో టాలీవుడ్ స్టార్ హీరోల ఆఫర్స్ అమ్మడు దగ్గరికి వెళుతూనే ఉన్నాయి. ఆమె ఎవరో కాదు.. కియారా అద్వానినే. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కియారా అద్వానీ అటు సినిమాల విషయంలోనే కాదు.. ఇటు ప్రేమ విషయంలోనూ దాగుడు మూతలాడుతుంది. సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ అంటూ పార్టీలకు, హోటల్స్ కి తిరుగుతున్న కియారా అద్వానీ ని.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే కియారా మాత్రం తనకి బాలీవుడ్ సినిమాల డేట్స్ అడ్జెస్ట్మెంట్ లేదని.. ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పింది

కానీ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా ఫిలిం కి కియారా ని సంప్రదించగానే కియారా వెంటనే ఓకె చెప్పేసిందట. అంటే ఎన్టీఆర్ సినిమా జస్ట్ 2 స్టేట్స్ కి సరిపోయే మూవీ. అదే రామ్ చరణ్ - శంకర్ మూవీ అంటే పాన్ ఇండియా ఫిలిం అనేగా కియారా దానికి ఓకె చెప్పింది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ కియారపై గుర్రుగా ఉన్నారు. రామ్ చరణ్ గతంలో కియారాకి ఎప్పటికికి మరిచిపోలేని డిజాస్టర్ ఇచ్చాడు. వినయ విధేయరామాలో రామ్ చరణ్ కి ఎంత డ్యామేజ్ జరిగిందో.. కియారాకి అంతే డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ తో శంకర్ పాన్ ఇండియా ఫిలిం అనగానే.. ఎన్టీఆర్ కి డేట్స్ అడ్జెస్ట్ కాలేదని చెప్పిన కియారా ఇక్కడ చరణ్ కి ఓకె చెప్పేసింది.

Kiara Advani To Romance Ram Charan in Shankar Movie

Hand to Tarak - Dates to Charan
kiara advani
bollywood top heroine
ram charan-shankar combo movie
ram charan
jr ntr
trivkram - ntr combo movie
kiara to romance ram charan
charan - shankar pan india movie
Advertisement
Advertisement