ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> RX 100 heroine Payal Rajput shared video..

కరోనా టెస్టుకి కేకలు పెట్టిన పాయల్..

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్, ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో కనిపించింది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో పాయల్ తన గ్లామర్ తో పాటు నటనతో ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసింది. తొందర్లోనే తెలుగులో మంచి హీరోయిన్ గా ఎదుగుతుందని అనుకున్నారు. కానీ ఆర్డీఎక్స్ లవ్ సినిమా వల్ల ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాదు పాయల్ రాజు పుత్ అంటే గ్లామర్ ఒలకబోసే పాత్రలే చేస్తుందనే పేరు కూడా తీసుకువచ్చింది.

ఐతే ప్రస్తుతం ఆర్డీఎక్స్ లవ్ తరహా పాత్రలు ఒప్పుకోవట్లేదట. తాజాగా పాయల్ రాజ్ పుత్ ఒకానొక తెలుగు సినిమాలో నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. అదీగాక హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందట. లాక్డౌన్ తర్వాత మళ్ళీ షూటింగులని స్టార్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్, మొదటగా కరోనా టెస్ట్ చేయించుకుంది.

షూటింగ్ స్పాట్ లో కరోనా టెస్ట్ చేయించుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలో పాయల్ రాజ్ పుత్ తెగ భయపడిపోతుంది. కరోనా టెస్ట్ చేయడానికి వాలంటీర్లు ముక్కులోపలికి నుండి శాంపిల్స్ సేకరించే టైమ్ లో పాయల్ బిగ్గరగా కేక వేసింది. ముక్కులోపల అసౌకర్యంగా అనిపించడంతో భయమేసిందట. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ మొదలు పెడుతున్నామన్నామని, తనకి నెగెటివ్ వచ్చిందని తెలిపింది.

Click here for video

RX 100 heroine Payal Rajput shared video..

RX 100 heroine Payal Rajput shared video..
payal rajput
rx100
rdxlove
coronavirus
covid19
Advertisement
Advertisement