Advertisement

డ్రగ్స్ కేస్: మీడియాకి ముఖం చాటేసిన రకుల్!!

Sun 13th Sep 2020 06:37 PM
rakul preet singh,drug scandal,media,waiting,response,hyderabad  డ్రగ్స్ కేస్: మీడియాకి ముఖం చాటేసిన రకుల్!!
Drug Scandal: Media Waiting for Rakul Preet Singh response డ్రగ్స్ కేస్: మీడియాకి ముఖం చాటేసిన రకుల్!!
Advertisement

బాలీవుడ్ నుండి టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పుడు సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ పేరును బయటపెట్టిన రియా చక్రవర్తి.. బాలీవుడ్‌లో సారా అలీ ఖాన్ పేరుని బయటపెట్టింది. ముంబైలోని లూనా వాలాలో మిడ్ నైట్ డ్రగ్స్ పార్టీలు జరిగేవని వాటికి టాలీవుడ్ హీరో హీరోయిన్స్ కూడా హాజరయ్యేవారని కానీ తానెప్పుడూ వెళ్లలేదని ఎన్సీబీ ఎదుట రియా వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రకుల్ మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరో హీరోయిన్స్ పేర్లు రియా చక్రవర్తి ఫోన్‌లో లభ్యమైనట్లుగా తెలుస్తుంది. ఇక సుశాంత్ ఫామ్ హౌస్‌లో ఈ డ్రగ్ పార్టీలు జరిగేవని రియా చెబుతుంది. ఇక ఈ కేసులో ముఖ్యంగా ఇప్పుడు రకుల్ పేరు బయటికి రావడంతో అందరూ షాకయ్యారు. బాలీవుడ్‌లో మూవీస్ చేస్తున్న రకుల్ అక్కడ అవార్డు ఫంక్షన్స్‌కి, పార్టీలకు తరుచు హాజరవడం, ఇప్పుడు రియా చక్రవర్తి రకుల్ పేరు బయటపెట్టడంతో రకుల్‌పై అందరిలో డౌట్ మొదలైంది.

అయితే తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో వికారాబాద్ అడవుల్లో షూటింగ్‌కి హాజరవుతున్న రకుల్... తన పేరు డ్రగ్స్ కేసులో బయటికొచ్చిన విషయం తెలియగానే షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ డ్రగ్స్ సేవించిన విషయంలో రకుల్‌ని ఎన్సీబీ అధికారులు వివరణ కోరగా రకుల్ స్పందించలేదని తెలుస్తుంది. తాను ఏ పార్టీకి హాజరవలేదని కానీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని కానీ రకుల్ చెప్పకుండా విచారణకు అందుబాటులోకి రావడం లేదని, ప్రస్తుతం మీడియా మొత్తం హైదరాబాదులో రకుల్ నివాసముంటున్న ఇంటి చుట్టూనే తిష్టవేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎన్సీబీ అధికారుల ఎదుటున రియా ఈ డ్రగ్స్‌కి సంబందించిన పలు విషయాలు చెప్పగా ఎన్సీబీ అధికారులు, టాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్‌లలో డ్రగ్స్ లింక్‌లను లోతుగా దర్యాప్తు చేపట్టినట్టుగా సమాచారం.

Drug Scandal: Media Waiting for Rakul Preet Singh response:

Sensation: Rhea Names Rakul In The Drug Scandal

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement