సంపత్‌నంది స్క్రిప్ట్‌తో వస్తోన్న ‘ఓదెల రైల్వేస్టేషన్’

సంపత్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
హీరోగా దయవిట్టు గమనిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్, మాయబజార్ 2016, వంటి హిట్ చిత్రాలతో పాటు ‘కె.జి.ఎఫ్, మఫ్టీ, టగరు, గోధి బన్నసాధరన మైకట్టు, కవచ, యువరత్న’ వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రలతో కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ తెలుగులో హీరోగా నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తోంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో మొదటిసారిగా ఈ చిత్రం ఫుల్ రియలిస్టిక్ అప్రోచ్‌తో ఉండబోతుంది. మేకప్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పూర్తి న్యాచురాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు దర్శకుడు అశోక్ తేజ. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుంది.
వశిష్టసింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేష్(రంగస్థలం ఫేమ్), భూపాల్, శ్రీగగన్, దివ్య సైరస్, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్దె తదితరులు నటిస్తోన్నఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఫైట్స్: రియల్ సతీష్,
సమర్ఫణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె.రాధామోహన్,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: సంపత్‌నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.
Odela RailwayStation title Look released
KK Radhamohan New Film With Sampath Nandi Script Is Odela RailwayStation






































