Advertisement

‘డర్టీ హరి’ నుంచి మరో సర్‌ప్రైజ్..!!

Wed 22nd Jul 2020 04:49 PM
ms raju,dirty hari,first single,lets make love,video song,surprise  ‘డర్టీ హరి’ నుంచి మరో సర్‌ప్రైజ్..!!
One More Surprise From Dirty Hari Movie ‘డర్టీ హరి’ నుంచి మరో సర్‌ప్రైజ్..!!
Advertisement

‘డర్టీ హరి’ మొదటి పాట ‘లెట్స్ మేక్ లవ్’ పూర్తి వీడియోతో ఎం.ఎస్ రాజు మరో సర్‌ప్రైజ్!

ఆద్యంతం రక్తికట్టించే సన్నివేశాలతో విడుదలైన కొన్నిగంటల్లోనే విపరీతమైన ఆదరణ పొంది 1 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించడమే కాక యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది ఎం.ఎస్ రాజు ‘డర్టీ హరి’ ట్రైలర్. ఈ సందర్భంగా ప్రేక్షకులని మరింత ఆకర్షించే విధంగా చిత్రంలోని మొదటి పాట ‘లెట్స్ మేక్ లవ్’తో ఈ నెల 24న మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు సమర్పకులు గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్. సరికొత్త కథనంతో, యూత్‌ని ఆకర్షించే కంటెంట్‌తో హైదరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డిని డర్టీ హరిగా పరిచయం చేస్తూ సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ లని నాయికలుగా చూపిస్తూ నటుడు సునీల్ వాయిస్ ఓవర్ తో చాలా వినోదాత్మకంగా సాగే ట్రైలర్ కి ప్రముఖ దర్శకులు, నటులు మరియు మీడియా ప్రముఖులు ప్రశంసలందించారు.

 

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన మా డర్టీ హరి ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. రొటీన్ కి భిన్నంగా ప్రయత్నిస్తున్న మా డైరెక్టర్ ఎం.ఎస్.రాజు గారు కథని మలిచిన విధానం యూత్ ని బాగా ఆకట్టుకోనుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. త్వరలోనే ఈ చిత్రంలోని మొదటి పాట ‘లెట్స్ మేక్ లవ్’ పూర్తి వీడియోతో ఈ నెల 24న మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మీ అందరికి కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు

సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్

ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్

డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి

ఎడిటర్: జునైద్ సిద్ధిఖి

సమర్పణ: గూడూరు శివరామకృష్ణ

నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్

రచన, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు

One More Surprise From Dirty Hari Movie:

MS Raju Dirty Hari First Single Let’s Make Love Video Song to release soon

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement