సాహో డైరెక్టర్ పెళ్ళి చేసుకోబోతున్నాడు..

Wed 03rd Jun 2020 10:12 AM
saaho,prabhas,sujith,chiranjeevi  సాహో డైరెక్టర్ పెళ్ళి చేసుకోబోతున్నాడు..
Saaho dorector going to marry a doctor. సాహో డైరెక్టర్ పెళ్ళి చేసుకోబోతున్నాడు..
Sponsored links

మొదటి సినిమా రన్ రాజా రన్ తో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ సుజిత్, రెండో సినిమాకే ప్రభాస్ ని పట్టేసాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఎవరితో ఉంటుందన్న ఆలోచన కూడా రాకముందే సుజిత్ తో సినిమా స్టార్ట్ చేసేసాడు. అయితే సాహో సినిమా ప్రేక్షకులని అలరించలేకపోయింది. బాహుబలి వంటి హిట్ వచ్చాక ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సాహో ఆ రేంజ్ ని అందుకోలేకపోయిందనే చెప్పాలి.

అయితే వినూత్నంగా సాహో సినిమా ఉత్తరాది వారికి తెగ నచ్చేసింది. ఇక్కడ బయ్యర్లకి నష్టాలని మిగిల్చిన ఈ చిత్రం, అక్కడ మాత్రం లాభాలని పంచింది. ప్రస్తుతం సుజిత్ చిరంజీవితో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. మళయాల చిత్రమైన లూసిఫర్ తెలుగు రీమేక్ పనులని చిరంజీవి సుజిత్ కి అప్పగించాడు. అయితే ఇంకా ఈ సినిమా మొదలు కాకముందే మనోడు పెళ్ళికొడుకు కాబోతున్నాడు.

తాను ప్రేమించిన ప్రవల్లిక అనే డాక్టర్ తో సుజిత్ వివాహం ఫిక్స్ అయిందట. ఈ నెల 10వ తేదీ నిశ్చితార్థం జరుపుతున్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఒక్కొక్కరు పెళ్లిబాట పడుతున్నారు. ఆ వరుసలో డైరెక్టర్ సుజిత్ కూడా చేరాడు.  లాక్డౌన్ టైమ్ లో నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత పెళ్ళి పెట్టుకుంటారట. మొత్తానికి సుజిత్ ఓ ఇంటివాడవుతున్నాడు. 

Sponsored links

Saaho dorector going to marry a doctor.:

Saaho director going to marry a doctor

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019