నిఖిల్ 18 పేజెస్ కి హీరోయిన్ దోరికింది..?

Nikhil 18 pages got heoine..?

Mon 01st Jun 2020 03:53 PM
Advertisement
nikhil,siddi idnaani,sai dharam tej,vaishnav tej,sukumar,geetha arts,uppena  నిఖిల్ 18 పేజెస్ కి హీరోయిన్ దోరికింది..?
Nikhil 18 pages got heoine..? నిఖిల్ 18 పేజెస్ కి హీరోయిన్ దోరికింది..?
Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవలే పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం తర్వాత కార్తికేయ 2 సినిమాని స్టార్ట్ చేసిన నిఖిల్ సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమాలోనూ హీరోగా కనిపిస్తున్నాడు. సుకుమార్ అందించిన కథతో కుమారి 21ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు.

మొదటగా అనూ ఇమ్మాన్యుయేల్ ని తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న క్రితిశెట్టి అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ సడెన్ గా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హీరోయిన్ గా సిద్ధి ఇద్నానీ అయితే సరిగ్గా సరిపోతుందని ఫీల్ అవుతున్నారట.

సిద్ధి ఇద్నానీ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన జంబలకిడి పంబ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకి గుర్తింపు రాలేదు. మరి సిద్ధీకి ఈ అవకాశం వస్తే ఆమె దశ తిరిగినట్టే అని చెప్పాలి. ఇప్పటికైతే ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. మరి అదృష్టం కలిసి వచ్చి సిద్ధీకి ఈ అవకాశం వస్తుందో లేదో చూడాలి.

Advertisement

Nikhil 18 pages got heoine..?:

Nikhil got heroine for his 18 pages

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement