పెద్దరికం: చిరుకి బాలయ్య ఇండైరెక్ట్ పంచ్!!

Balayya’s indirect Punch on Mega Star Chiranjeevi

Thu 28th May 2020 04:37 PM
Advertisement
balakrishna,sensational comments,celebrities meeting,corona,chiranjeevi,ccc  పెద్దరికం: చిరుకి బాలయ్య ఇండైరెక్ట్ పంచ్!!
Balayya’s indirect Punch on Mega Star Chiranjeevi పెద్దరికం: చిరుకి బాలయ్య ఇండైరెక్ట్ పంచ్!!
Advertisement

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్స్ అన్నీ గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. అయితే షూటింగ్స్ నిలిచిపోయిన తర్వాత సినిమా పరిశ్రమని ఆదుకోవడానికి సినిమా స్టార్స్ అందరూ తలా ఒక చెయ్యి వేసి విరాళాలు ప్రకటించారు. చిరు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, పవన్, మహేష్, బాలకృష్ణ అందరూ పెద్ద మొత్తంలో సహాయం చేసారు. ఇక చిరు ఇండస్ట్రీకి పెద్దగా సినిమా కార్మికులను ఆదుకోవడానికి సీసీసీ అంటూ ఓ ట్రస్ట్ ద్వారా సహాయం అందించాడు. అయితే ఇంత జరిగినా బాలకృష్ణ మాత్రం విరాళం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. కానీ చిరుకి హెల్ప్ కానీ మాట సహాయం కానీ చెయ్యలేదు. అయితే తాజాగా చిరు సినిమా పెద్దలతో సమావేశమై ప్రభుత్వంతో షూటింగ్స్‌కి అనుమతులు వచ్చేలా చర్చలు జరుపుతున్నాడు.

ఈ మీటింగ్‌కి చిరు.. తలసాని శ్రీనివాస్, నాగార్జున, కొరటాల, రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులతో సమావేశమై ప్రభుత్వంతో చర్చలకు దిగడం, అలాగే కేసీఆర్ తో భేటీ అయ్యి సినిమా షూటింగ్స్ పై ఆలోచించాలని వినతి పత్రం ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. కానీ వీటన్నిటిలో బాలయ్య మిస్సింగ్. అయితే తాజాగా బాలయ్యని ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఎవరూ పిలవలేదా? అంటే అవుననే అంటున్నాడు బాలకృష్ణ. తాజాగా బాలకృష్ణ ఎన్టీఆర్ 97 వ జయంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులర్పించారు. 

అక్కడ మీడియాతో సమావేశమైన బాలకృష్ణ సినిమా షూటింగ్స్‌కి ఇది గడ్డుకాలమని, గతంలో ఉన్నట్లుగా సినిమా షూటింగ్స్ ఇకపై జరగవని, ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి అనుమతులివ్వడం, ప్రభుత్వంతో సినిమా పెద్దలు చర్చలు జరపడం తనకి అస్సలు తెలియదని, తాను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నా అని చెబుతున్నాడు. అంటే చిరు మాట వరసకైనా బాలయ్యకి విషయం చెప్పలేదా? నాగ్‌తో మాట్లాడిన చిరు.. బాలయ్యని దూరం పెట్టాడా? కావాలనే బాలయ్యని ఈ కరోనా విషయాల్లో ఇన్వాల్వ్ చెయ్యలేదా? మరి బాలయ్య మాటలను బట్టి చూస్తే నిజమనిపిస్తుంది. అయినా బాలయ్య కూడా ఈ విషయాన్ని మీడియా ముఖంగా మాట్లాడి.. చిరుకి ఇండైరెక్ట్ పంచ్ వేసినట్లే కనబడుతుంది.

Advertisement

Balayya’s indirect Punch on Mega Star Chiranjeevi:

Balakrishna sensational comments on Celebrities Meeting about Corona 

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement