దేవికి ఇదే మంచి అవకాశం..

Wed 08th Apr 2020 01:34 PM
pushpa,allu arjun,sukumar,devi sri prasad   దేవికి ఇదే మంచి అవకాశం..
Devi Sri Prasad got nice opportunity దేవికి ఇదే మంచి అవకాశం..
Sponsored links

 

తెలుగు చిత్ర పరిశ్రమలోని సంగీత దర్శకులందరిలో దేవిశ్రీ ప్రసాద్ స్థానం ప్రత్యేకం. పదహారేళ్ల వయసుకే సంగీత దర్శకుడిగా మారి బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించాడు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో టాప్ కి చేరిన దేవి, స్టార్ హీరోల ఏకైక ఛాయిస్ గా మారాడు. అయితే ఏ సంగీత దర్శకుడయినా ఒకానొక టైమ్ లో తన కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజమే.

ప్రస్తుతం దేవి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. దేవి మ్యూజిక్ లో కొత్తదనం లేదన్న కారణంగా స్టార్ హీరోలు అతన్ని కాదని వేరే దర్శకుడి వద్దకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల టాప్ వన్ లో కొనసాగాల్సిన దేవి రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప సినిమాతో దేవికి మంచి అవకాశం వచ్చింది.

సుకుమార్- దేవి కాంబోలో వచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుండి మొన్న వచ్చిన రంగస్థలం వరకు అన్ని ఆల్బమ్స్ సూపర్ హిట్టే. కాబట్టి అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాలోనూ మ్యూజిక్ సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. అదే గనక నిజమైతే దేవిశ్రీ ప్రసాద్ పోగొట్టుకున్న ఒకటవ స్థానాన్ని మళ్లీ అందుకోవచ్చని అనిపిస్తుంది.

Sponsored links

Devi Sri Prasad got nice opportunity:

Devi sri prasad got an opportunity to prove

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019