Advertisement

‘పుష్ప’గా అల్లు అర్జున్.. అప్డేట్ ఇదే!

Tue 07th Apr 2020 07:39 PM
pushpa,allu arjun,sukumar,title,allu arjun birthday  ‘పుష్ప’గా అల్లు అర్జున్.. అప్డేట్ ఇదే!
Allu Arjun and Sukumar Movie Title Leaked ‘పుష్ప’గా అల్లు అర్జున్.. అప్డేట్ ఇదే!
Advertisement

అల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రకటన రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజున రివీల్ చెయ్యడానికి ఓ పోస్టర్‌ని కూడా వదిలారు. అల్లు అర్జున్ పుట్టినరోజుకి సుకుమార్ ఓ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ కానీ ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ వదలడం కష్టం కనక అల్లు అర్జున్ లుక్ తో పాటుగా ఆ సినిమా టైటిల్ ని వదలబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని అంటున్నారు.

అయితే బన్నీ - సుక్కు సినిమా కి రెండక్షరాల టైటిల్ అంటూ... ఇది సుక్కు - బన్నీ సెంటిమెంట్ అంటూ ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా టైటిల్ గా పుష్ప అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప కాబట్టి.. అందుకే ఈ సినిమాకి పుష్ప టైటిల్ పెట్టారని అంటుంటే... మరోవైపు.. ఈ సినీమాలో హీరో పేరే... పుష్పక్ నారాయణ్ గా ఈ సినిమాలో బన్నీ కనిపించబోతున్నాడట. సినిమాలో అల్లు అర్జున్ ని అంతా పుష్ప అని పిలుస్తుంటారు. అందుకే ఈసినిమాకి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేసి.. రేపు పుట్టిన రోజు కానుకగా ఈ టైటిల్ తో పాటుగా సినిమా ఫస్ట్ లుక్ కూడా వదలబోతున్నారట.

Allu Arjun and Sukumar Movie Title Leaked:

Pushpa is the Bunny and sukku Movie title

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement