ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Iam Safe In America Says Rana Heroine!

అమెరికాలో నేను సేఫ్‌గా ఉన్నా: రానా హీరోయిన్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలు ఎక్కడోళ్లు అక్కడో నిలిచిపోయారు. అయితే.. ఇంకొదరిపై అయితే కరోనాతో చనిపోయారనే పుకార్లు కూడా వచ్చేస్తున్నాయ్. అయితే తాజాగా అప్పుడెప్పుడో ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘నాగవళ్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’ చిత్రాల్లో మెరిసి తెరమరుగైపోయిందే ఆ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ గురించి హాట్ టాపిక్ అయ్యింది. చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడి కుర్రాడినే పెళ్లి చేసుకుందీ భామ. 

కరోనాతో అమెరికాలో మరణ మృదంగం మోగుతోంది. రోజుకు ఎంతమంది ఈ వైరస్‌తో చనిపోతున్నారో అస్సలు లెక్కేలేకుండా పోయింది. ఈ తరుణంలో అసలు రీచా  పరిస్థితేంటి..? ఎలా ఉంది..? ఏమైపోయింది.. ఇంతకీ ఆమె సేఫ్‌గా ఉందా లేదా..? అని పలువురు నెటిజన్లు ఆరాతీయడంతో పాటు.. ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు చేయడంతో ఎట్టకేలకు స్పందించింది.

తాను సేఫ్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అందరికీ హాయ్ చెబుతూ.. మరోవైపు తాను నటించిన హీరోలను సైతం ఈ భామ గుర్తు చేసుకుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇలా చాలా సేపే అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిచ్చింది. ఇదిలా ఉంటే.. మళ్లీ సినిమాల్లో నటిస్తారా..? తెలుగులో ఎప్పుడు నటిస్తారు..? అని అడగ్గా ఈ మాటలకు మాత్రం రిచా రియాక్ట్ అవ్వల్లేదు. మొత్తానికి చూస్తే సినిమాలకు ఈ భామ ఇక గుడ్ బాయ్ చెప్పేసినట్లేనని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Iam Safe In America Says Rana Heroine!

Iam Safe In America Says Rana Heroine!
rana heroine
richa gangopadhyay
actress richa
corona crysis
america
Advertisement
Advertisement