శివగామిని ఎదుర్కోబోతున్న మెగా హీరో..?

Wed 01st Apr 2020 12:10 PM
sai dharam tej,ramyakrishna,devakatta   శివగామిని ఎదుర్కోబోతున్న మెగా హీరో..?
Ramya krishna playing negative role in Mega hero film శివగామిని ఎదుర్కోబోతున్న మెగా హీరో..?
Sponsored links

సాయి ధరమ్ తేజ్ వరుస్ ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. ఆ సినిమా నుండి మళ్ళీ విజయాల బాట పడ్డాడు. మొన్నటికి మొన్న ప్రతిరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ప్రస్తుతం రెండు సినిమాల్ని లైన్లో పెట్టిన సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు, దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. దేవకట్టాకి సరైన హిట్ లేకపోయినప్పటికీ ఆయన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు సాయి.

అయితే దేవకట్టాతో చేస్తున్న సినిమాలో సాయి తేజ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడట. ఇంతకుముందు కనిపించని సరికొత్త పాత్రలో సాయి తేజ్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్  రమ్యక్రిష్ణ నెగెటివ్ రోల్ చేస్తుందట. రమ్యక్రిష్ణ ఇప్పటి వరకు చేసిన నెగెటివ్ పాత్రల మాదిరిగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. అయితే స్టూడెంట్ లీడర్, ముఖ్యమంత్రిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండనున్నాయట.

విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసే సాయి తేజ్ రమ్యక్రిష్ణని ఎదుర్కొంటాడట. మరి ఈ నేపథ్యంలో సాయి తేజ్ నటన అదిరిపోయేలా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే శివగామితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. శివగామి ముందు సాయి తేజ్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Sponsored links

Ramya krishna playing negative role in Mega hero film:

Ramya krishna Playing negative role in Sai dharam Tejs movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019