Advertisement

కాజ‌ల్ హ‌వా కంటిన్యూస్‌...

Sun 29th Mar 2020 12:07 PM
kajal agarwal,thupaki 2,acharya,indian 2,heroine  కాజ‌ల్ హ‌వా కంటిన్యూస్‌...
Kajal Agarwal in 3 big Projects కాజ‌ల్ హ‌వా కంటిన్యూస్‌...
Advertisement

తెలుగు సినిమా చంద‌మామ‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ గుర్తింపు పొందింది. కృష్ణ‌వంశీ రూపొందించిన ‘చంద‌మామ’ సినిమా చేసిన‌ప్ప‌ట్నుంచీ ఆమెకు అది రెండో పేర‌య్యింది. 2004లోనే హిందీ సినిమా ‘క్యూం.. హో గ‌యా నా’లో ఒక సైడ్ క్యారెక్ట‌ర్‌తో ఎంట్రీ ఇచ్చిన కాజ‌ల్ 2007లో తేజ రూపొందించిన ‘ల‌క్ష్మీ క‌ల్యాణం’తోటే హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఆ వెంట‌నే ‘చంద‌మామ’ మూవీ వ‌చ్చింది. అంటే.. కాజ‌ల్‌కు బ్రేక్ ఇచ్చింది టాలీవుడ్డే. 2009లో వ‌చ్చిన య‌స్‌.య‌స్. రాజ‌మౌళి చిత్రం ‘మ‌గ‌ధీర’ ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చింది.

ఆ త‌ర్వాత డార్లింగ్‌, బృందావ‌నం, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, బిజినెస్‌మ్యాన్‌, నాయ‌క్‌, బాద్‌షా, టెంప‌ర్‌, ఖైదీ నంబ‌ర్ 150, నేనే రాజు నేనే మంత్రి.. వంటి సినిమాల్లో త‌న అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అటు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ వ‌స్తోంది. ‘టెంప‌ర్’ సినిమా త‌ర్వాత కాజ‌ల్ క‌రిష్మా త‌గ్గిపోతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ టైమ్‌లో ‘జ‌న‌తా గ్యారేజ్’ సినిమాలో ‘ప‌క్కా లోక‌ల్‌’ ఐట‌మ్ సాంగ్ చేసి, ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేసింది. చిరంజీవి క‌మ్‌బ్యాక్ ఫిల్మ్ ‘ఖైదీ నంబ‌ర్ 150’లో హీరోయిన్‌గా ఎంపికైన‌ప్పుడు చిరంజీవి వంటి వ‌య‌సుమ‌ళ్లిన హీరో స‌ర‌స‌న ఆయ‌నలో స‌గం వ‌య‌సు కూడా లేని కాజ‌ల్ హీరోయిన్ ఏమిట‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సినిమా రిలీజ‌య్యింది. పాట‌ల్లో ఆ ఇద్ద‌రి జోడీ అల‌రించింద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా! ‘అమ్మ‌డూ లెట్స్ డు కుమ్ముడూ’, ‘యు అండ్ మి’ సాంగ్స్‌లో ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ బాగా పండింది. ఆ పాట‌లు ఇప్ప‌టికీ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను అల‌రిస్తూనే ఉన్నాయి.

సీన్ క‌ట్ చేస్తే.. కాజ‌ల్ ప‌నైపోయింద‌నే వార్త‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. కానీ ఇవాళ ఏకంగా మూడు భారీ సినిమాల్లో, ముగ్గురు టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ మ‌రోసారి విమ‌ర్శ‌కుల‌కు చెక్ పెడుతోంది కాజ‌ల్‌. ఇప్ప‌టికే శంక‌ర్ ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్ ‘భార‌తీయుడు 2’లో క‌మల్ హాస‌న్ జోడీగా న‌టిస్తోన్న ఆమె, చిరు లేటెస్ట్ సినిమా ‘ఆచార్య‌’లో నాయిక‌గా ఎంపికైంది. ఈ విష‌యాన్ని ఒక వీడియో ద్వారా స్వ‌యంగా ఆమె తెలిపింది. అంటే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాక చేస్తున్న మూడో సినిమాలో రెండోసారి ఆయ‌న జోడీగా న‌టించే చాన్స్ కొట్టేసింది కాజ‌ల్‌. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మొద‌ట హీరోయిన్‌గా ఎంపికైన త్రిష త‌ప్పుకోవ‌డం కాజ‌ల్‌కు క‌లిసొచ్చింది. అలాగే త‌మిళంలో టాప్ స్టార్ విజ‌య్ హీరోగా ఎ.ఆర్‌. మురుగ‌దాస్ డైరెక్ట్ చేయ‌నున్న ‘తుపాకి 2’ సినిమాలోనూ నాయిక‌గా ఎంపికైంది కాజ‌ల్‌. అదివ‌ర‌కు వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘తుపాకి’లోనూ ఆమె హీరోయిన్‌గా న‌టించింది. అంటే సీక్వెల్‌లోనూ ఆమెకే అవ‌కాశం ఇచ్చాడు మురుగ‌దాస్‌.

ఇలా 34 ఏళ్ల వ‌య‌సులోనూ త‌న క‌రిష్మా త‌గ్గ‌లేద‌ని నిరూపించుకుంటోంది కాజ‌ల్‌. రానున్న రోజుల్లో మ‌రిన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్రాజెక్ట్స్‌లో ఆమె భాగం అయితే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Kajal Agarwal in 3 big Projects:

Kajal Agarwal hawa continues in south

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement