హీరోకంటే పూజా హెగ్డేకే ఎక్కువ పారితోషికం..!

Fri 27th Mar 2020 08:44 PM
pooja hegde,remuneration,prabhas,akhil,most eligible bachelor  హీరోకంటే పూజా హెగ్డేకే ఎక్కువ పారితోషికం..!
New about Pooja Hegde Remuneration హీరోకంటే పూజా హెగ్డేకే ఎక్కువ పారితోషికం..!
Sponsored links

ప్రస్తుతం టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా దున్నేస్తున్న పూజా హెగ్డే పారితోషకంలో కూడా టాప్ లేవల్లోనే ఉంది. సినిమాకి రెండు నుండి రెండున్నర కోట్లు డిమాండ్ చేసి మరీ అందుకుంటున్న పూజా హెగ్డే క్రేజ్ వాల్మీకి, అల వైకుంఠపురములో హిట్స్ తో మరింతగా పెరిగిపోయింది. అయితే తాజాగా పూజా హెగ్డే పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అటు బాలీవుడ్ లోను క్రేజ్ తో సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే.. ఇప్పుడు టాలీవుడ్ లో తాను నటిస్తున్న సినిమాలో హీరో కన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటుందట.

ప్రభాస్‌తో జాన్ సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే.. ప్రభాస్ పారితోషకంలో 1 పాయింట్ కూడా ఉండదు పూజా పారితోషకం. ఎందుకంటే ప్రభాస్ ది ఇంటర్నేషనల్ క్రేజ్ గనక. ఇక రెండో సినిమా అక్కినేని అఖిల్ సినిమా చేస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అఖిల్ కి జోడిగా నటిస్తున్న పూజా హెగ్డే .. ఈ సినిమా కోసం అఖిల్ కన్నా ఎక్కువ పారితోషకమే అందుకుంటుందనే టాక్ వినబడుతుంది. అఖిల్ కి వరసగా మూడు డిజాస్టర్స్ ఉండడం, పూజా హెగ్డే కి వరస సినిమాలు హిట్స్ తో క్రేజ్ పెరగడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద అంచనాలు పెరుగుతాయని భావించే అఖిల్ కన్నా ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి రెడీ అయ్యారట నిర్మాతలు. మాములుగా అయితే హీరోల కన్నా హీరోయిన్స్ కి పారితోషకం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగిందట.

Sponsored links

New about Pooja Hegde Remuneration :

Pooja Hegde remuneration High then Hero remuneration

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019