Advertisement

కరోనాకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్జీవీ!

Thu 05th Mar 2020 07:38 AM
rgv,ramgopal varma,strong warning,corona virus,kovid-19  కరోనాకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్జీవీ!
RGV Strong Warning To Corona Virus! కరోనాకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్జీవీ!
Advertisement

అవును మీరు వింటున్నది నిజమనండోయ్.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా.. కరీనా అనబోయి కరోనా అని పొరబడుతున్నారనే సందేహం మళ్లీ మళ్లీ వస్తోంది కదూ..? అదేం కాదండోయ్.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఇంతకీ ఆర్జీవీ ఏమన్నారు..? వైరస్‌కు ఆర్జీవీ వార్నింగ్ ఇవ్వడమేంటి..? అనే ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మరణమే.. నో.. వే!

కరోనా వైరస్.. పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఏకంగా ఆ దేశాన్ని దాటి ప్రపంచం నలుమూలలా దాదాపు వ్యాపించేసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకడంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వైరస్ అసలు ఎలా వస్తోంది..? దేని వల్ల వస్తోంది..? దీనికి మందేంటి..? అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. ఈ వైరస్ సోకితే ఏకంగా మరణమే తప్ప మరో మార్గం లేదు. ఇలాంటి తరుణంలో పలువురు సెలబ్రిటీలు తగు జాగ్రత్తలు చెబుతూ వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు విషయాలు షేర్ చేసుకుంటున్నారు.

బతుకు.. బతికించు!

అయితే.. సమయం, సందర్భాన్ని బట్టి సామాన్యుడు నుంచి.. సెలబ్రిటీ ఆఖరికి దేవుడిని కూడా వదలని రామ్ గోపాల్ వర్మ.. కరోనాను ఎందుకు వదలాలి..? అనుకున్నాడేమో ఏకంగా వైరస్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ‘డియర్ కరోనా వైరస్.. మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్తున్నావ్.. అలా చంపుకుంటే వెళ్లే బదులు ఒక విషయం గురించి తెలుసుకో. నీవు ఒక పరాన్నజీవివి. నువ్వు సోకితే మాతో పాటే నువ్వు కూడా చస్తావ్. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు నా విన్నపం ఏమిటంటే.. బతుకు.. బతికించు. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ కరోనాపై ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్‌కు పలువురు వీరాభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

RGV Strong Warning To Corona Virus!:

RGV Strong Warning To Corona Virus!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement