వామ్మో.. శ్రీరెడ్డీ ఏంటీ అరాచకం..!?

Sat 22nd Feb 2020 12:27 AM
sree reddy,sivarathri special,tiktok video  వామ్మో.. శ్రీరెడ్డీ ఏంటీ అరాచకం..!?
Sree Reddy.. Sivarathri Special Hadavudi! వామ్మో.. శ్రీరెడ్డీ ఏంటీ అరాచకం..!?
Sponsored links

వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. నిత్యం నాలుగు వివాదాలు.. నలభై మంది నోళ్లలో నానాలనేది ఆమె సిద్ధాంతం.. ఇందుకోసం ఈ హాట్ ఏమైనా చేస్తుంది.. ఎంతైనా చేసేస్తుంది. అప్పుడెప్పుడో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ బాగా హడావుడి చేసి చివరికి ఏదో సాధించేశాననుకొని హైదరాబాద్‌ ఇక వద్దంటూ చెన్నై చెక్కేసింది. హమ్మాయ్యా.. ఇక సోషల్ మీడియా ఊపిరి పీల్చుకో.. శ్రీరెడ్డి చెక్కేసింది అని నెటిజన్లు భావించారు. అయితే.. చెన్నైకి వెళ్లిన తర్వాత ప్లేస్ మారొచ్చేమో కానీ నేను నేనేగా అన్నట్లుగా అస్సలు తగ్గని శ్రీరెడ్డి అక్కడికెళ్లాక మరిన్ని వివాదాల్లో మునుగుతూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

ఖాళీగా ఉంటే ఏమొస్తుంది.. ఏదో ఒకటి చేద్దాం.. అనుకుని టాలీవుడ్‌ను మళ్లీ కెలికి మరీ రాళ్లేయించుకుంటోంది. ఇటీవలే జూనియర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, డ్యాన్స్ మాస్టర్‌ను గోకి పోలీసు కేసుల దాకా వ్యవహారం వెళ్లింది. అంతేకాదు.. శ్రీరెడ్డిని అరెస్ట్ చేసినా చేయొచ్చేమో అనేంతలా హడావుడి జరిగింది. శివరాత్రి రావడంతో ఆ వ్యవహారం మరుగున పడింది. అయితే శివరాత్రికి ఏదో ఒక స్పెషల్ (వంట కాదండోయ్ బాబూ..) చేద్దామని భావించి ఇదిగో ఇలా ఓ వీడియో వదిలింది. ఇక నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్‌కు ఒక్కసారిగా పూనకాలొచ్చేశాయ్.

పరమ శివుడి అవతారమెత్తిన శ్రీరెడ్డి.. ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో కర్ర, నట్టన బొట్లూ, హెయిర్ అంత ఒత్తుగా కట్టి, మెడనిండా రుద్రాక్షలు వేసి ఎగిరి గంతులేస్తూ గట్టిగానే హడావుడి చేస్తూ ఉన్న ఓ వీడియోను అలా టిక్‌టాక్‌లో వదిలింది. అంతేకాదండోయ్.. పక్కనే ఇద్దరు ఇద్దరు భక్తులు ఆమెతో పాటు ఊగిపోతున్నారు. ‘ఓం నమ: శివాయ’  అంటూ కోరస్ ఇస్తూ విన్యాసం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఫాలోవర్స్ శ్రీరెడ్డిని గట్టిగా తిట్టిపోస్తున్నారు. ఛీ..ఛీ మీరు శివుడి అవతారమేయడమేంటి..? చచ్చిపోవాలనిపిస్తోందని మనసులో కొందరు అనుకోగా.. మరికొందరు మాత్రం నో మొహమాటం.. అంటూ దుమ్ముదులిపి వదులుతున్నారు. ఎంతైనా ఇవన్నీ శ్రీరెడ్డికే చెల్లుతాయ్ మరి.

Sponsored links

Sree Reddy.. Sivarathri Special Hadavudi!:

Sree Reddy.. Sivarathri Special Hadavudi!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019