దిల్ రాజుకి వినాయక్ షాకిచ్చాడా..?

Sat 15th Feb 2020 11:55 PM
vv vinayak,shock,dil raju,seenayya,movie  దిల్ రాజుకి వినాయక్ షాకిచ్చాడా..?
VV Vinayak Gives Shock to Dil Raju దిల్ రాజుకి వినాయక్ షాకిచ్చాడా..?
Sponsored links

వినాయక్ దర్శకుడిగా ఫెడవుట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. రొటీన్ సినిమాలతో పిచ్చ ప్లాప్స్ తీసిన వినాయక్ కి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చే హీరో కరువయ్యాడు. మధ్యలో బాలకృష్ణ సినిమా ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగినా అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే వినాయక్ హీరో అవతారమెత్తాడు. ఈ వయసులో వినాయక్ హీరో ఏంటి అనుకుని షాకవుతుంటే ఆ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడంటే ఇంకా పెద్ద షాక్ అయ్యారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అది ఎవరూ కాదనలేరు. కానీ ప్రస్తుతం డిజాస్టర్ డైరెక్టర్. అలాంటి వినాయక్ తో అందులోను విలన్ లా కనబడే వినాయక్ తో దిల్ రాజు మూవీ.

అబ్బా వినడానికి ఇంట్రెస్ట్ లేకయినా శీనయ్య టైటిల్ తో సినిమా ఎప్పుడో మొదలవడమే కాదు సగం షూటింగ్ కూడా పూర్తి చేసేసుకుంది. మరి తాజా సమాచారం ప్రకారమే ఇప్పుడు వినాయక్ శీనయ్య సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది. అది కూడా వినాయక్ ఆపేసాడని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన వినాయక్ దర్శకుడిగా ఆలోచించి ఈ సినిమా బాగా రాలేదని ఇంకా సినిమా కంటిన్యూ చేస్తే పెట్టిన డబ్బులు కూడా పోతాయని చెప్పి దిల్ రాజుతో సినిమా షూటింగ్ ని ఆపించేసినట్లుగా ఓ టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. అంతేకాకుండా రషెస్ చూసుకుని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వినాయక్ ఈ సినిమా కథ కూడా అప్పట్లో వచ్చిన ఒక సూపర్ హిట్ కథకు పోలి ఉండడంతో దిల్ రాజుకి నచ్చజెప్పి ఈ సినిమాని వినాయక్ ఆపేసాడని అంటున్నారు.

Sponsored links

VV Vinayak Gives Shock to Dil Raju:

News About Vinayak and Dil Raju

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019