Advertisementt

Ads by CJ

‘త్రీ మంకీస్’ వచ్చేందుకు రెడీ..!

Sun 02nd Feb 2020 01:40 AM
sudheer,get up srinu,ram prasad,3 monkeys,movie,release,february 7  ‘త్రీ మంకీస్’ వచ్చేందుకు రెడీ..!
3 Monkeys Movie Release Date Fixed ‘త్రీ మంకీస్’ వచ్చేందుకు రెడీ..!
Advertisement
Ads by CJ

ఫిబ్ర‌వ‌రి 7న విడుదలవుతున్నయూత్ ఫుల్ ఎంటర్‌టైన‌ర్ ‘త్రీ మంకీస్’.

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి  7న గ్రాండ్‌గా  విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో...

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ -  ‘త్రీ మంకీస్’  ఇప్పటి వరకు నేను  భరించాను. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నా జబర్దస్త్ ని మించి ఈ సినిమా ఉంటుంది. కామెడీతోపాటు అన్ని అంశాలుంటాయి. ప‌క్కా  పైసా వసూల్ చిత్రమిది. ఈ సినిమాలో సుధీర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గెటప్ శ్రీను అప్ కమింగ్ డైరెక్టర్‌గా, రాంప్రసాద్ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్ గా క‌నిపిస్తారు. ఇక హీరోయిన్ కారుణ్య సన్నీలియోన్ గా మిమ్మ‌ల్ని అలరిస్తుంది. రేపు థియేటర్ లో సినిమా చూసి తప్పకుండా ఎమోషన్ అవుతారు’’ అన్నారు.

చిత్ర నిర్మాత నగేష్ - ‘‘సినిమా పూర్తయి చాలా రోజులైంది. మంచి టైమ్ కోసం వెయిట్ చేశాం. ఫిబ్రవరి 7న

మంచి టైమ్ గా భావిస్తున్నాం.  ‘త్రీ మంకీస్’ టైటిల్ కి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్ర‌సాద్  యాప్ట్ అనేలా పెర్‌ఫామ్ చేశారు. నాకు మా బేన‌ర్‌కి మంచి పేరు చిత్రమవుతుంది’’ అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ-  ‘‘శ్రీను, రాంప్రసాద్ ఈ ఇద్ద‌రే నా బలం. మేము ముగ్గురం కలిసి సరదాగా నటించాం.

కామెడీతోపాటు సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా విజ‌య‌వంతం చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ - ‘‘సినిమా విడుదల కోసం నేను మా టీమ్ అందరం చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాం. ముగ్గురం కలిసి నటించిన తొలి చిత్రమిది, ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది’’ అన్నారు.

ఆటో రామ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ‘‘జబర్దస్త్ లో మొదటి స్కిట్ చేసినప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో, ఈ సినిమా కోసం అంతే టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాం. అందులో సక్సెస్ అయ్యాం. సినిమా విషయంలో కూడా త‌ప్ప‌కుండా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

హీరోయిన్  కారుణ్య మాట్లాడుతూ- ‘‘ఇందులో డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. నేను  గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర  చేయలేదు. ఈ పాత్ర‌ని నా కంటే దర్శకుడే ఎక్కువగా నమ్మారు ‘త్రీ మంకీస్’ తో క‌లిసి నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్ర‌సాద్, కారుణ్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి

కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి

నిర్మాత: నగేష్. జి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి

లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి

సినిమాటోగ్రఫీ: సన్నీదోమల

ఎడిటింగ్: ఉదయ్ కుమార్

సంగీతం: అనిల్ కుమార్ జి

మాటలు: అరుణ్. వి

లిరిక్స్: శ్రీమణి

పిఆర్ఓ: వంశీ - శేఖర్.  

3 Monkeys Movie Release Date Fixed :

3 Monkeys Movie Release on FEB 7th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ