‘సముద్రుడు’.. ఇంకా 3 పాటలే బ్యాలెన్స్!

Fri 17th Jan 2020 01:12 PM
ramakanth,bhanu sree,samudrudu,movie,shooting,update  ‘సముద్రుడు’.. ఇంకా 3 పాటలే బ్యాలెన్స్!
Samudrudu Shooting Completed ‘సముద్రుడు’.. ఇంకా 3 పాటలే బ్యాలెన్స్!
Sponsored links

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సముద్రుడు’.

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బదావత్ కిషన్ నిర్మాతగా నగేష్ నారదాసి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘సముద్రుడు’ చిత్రం నిరాటంకంగా 25 రోజులపాటు చీరాల ఓడరేవు సముద్ర తీరంలో రెండవ షెడ్యూల్ ముగించింది. 3 పాటలు మినహా పూర్తి షూటింగ్ ముగిసిందని. అతి త్వరలో పాటలు ఫారిన్ లో చిత్రీకరణ జరుగుతుందని దర్శకుడు నగేష్ నారదాసి తెలిపారు. చీరాల ప్రజలు చూడటానికి వెల్లువలా తరలివచ్చిన అక్కడి ప్రజలు కానీ పోలీస్ వ్యవస్థ గాని, ex ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు తదితర పెద్దలు సంపూర్ణంగా సహకరించారని. చిత్రం ఆధ్యంతం అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చిందని నిర్మాత తెలిపారు. మత్సకారుల బ్యాక్ డ్రాప్ లో పూర్తి కమర్షియల్ హంగులతో చిత్రీకరణ జరిగిందని తెలిపారు. ఈ చిత్రానికి శ్రీ రామోజు జ్ఞానేశ్వర్, సోములు, రామారావులు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.    

ఈ చిత్రంలో రమాకాంత్ హీరోగా, భాను శ్రీ (బిగ్ బాస్), అవంతికలు హీరోయిన్లుగా నటిస్తుండగా సుమన్, రామరాజు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ,(జూనియర్) రాజశేఖర్, చిత్రంశ్రీను, శ్రావణ్, జబర్దస్త్ శేషు, రాజ ప్రేమి, తేజ రెడ్డి, దిల్ రమేష్, డానియెల్, మల్లేష్, ప్రభావతి, గణేష్, కిషోర్, సిరిరాజ్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: వాసు, ఫైట్స్: సతీష్, నందు, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, డాన్స్: అనీష్, ఎడిటింగ్: బుల్ రెడ్డి, నిర్మాత: బదావత్ కిషన్, కధ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: నగేష్ నారదాసి.

Sponsored links

Samudrudu Shooting Completed:

Samudrudu Movie Shooting Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019